ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని, అమానతుల్లా ఖాన్‌ను విడుదల చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలరని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల వచ్చేంత వరకు అమానతుల్లా ఖాన్ సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. గతంలో రిమాండ్‌లో ఉన్న సమయంలో అమానతుల్లా ఖాన్ విచారణకు సహకరించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు.. అమానతుల్లా ఖాన్ తరపు న్యాయవాది ఈడీ వాదనలను వ్యతిరేకించారు. ఈ క్రమంలో.. తన క్లయింట్‌ను విడుదల చేయాలని కోర్టును అభ్యర్థించారు. బెయిల్ మంజూరు కోసం అమానతుల్లా ఖాన్‌కు కోర్టు ఎలాంటి షరతునైనా విధించవచ్చని లాయర్ చెప్పారు. గత శుక్రవారం, ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే అమానతుల్లా ఖాన్‌కు మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో.. ఈడీ అమానతుల్లా ఖాన్‌ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. అమానతుల్లా తన సహా నిందితులు దాదాపు 48 మంది సాక్షులను విచారించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
0 Comments