Ad Code

జైనూరులో 144 సెక్షన్


తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం లో ఆదివాసీ మహిళపై ఓ వర్గానికి చెందిన వ్యక్తి లైంగిక దాడి జరిపి హత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆదివాసీ సంఘాలు వారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఆదివాసులకు మద్దతుగా ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీష్ బాబు జైనూర్ వెళ్లనున్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న జైనూర్ లో ఈ రోజు పరిస్థితులు ఉదృతంగా మారాయి. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నెట్ వర్క్ ను సైతం తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జైనూర్ ఏజెన్సీలో దాదాపు వెయ్యి మంది పోలీసులు పహారా కాస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu