Ad Code

ఆగస్టులో జీఎస్టీ ₹1.75 లక్షల కోట్లు వసూళ్లు !


గస్టు నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను వసూళ్ల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఆగస్టు మాసానికి రూ.1.75 లక్షల కోట్లు వసూళ్లు జరిగినట్లు పేర్కొంది. గతేడాది ఇదే నెలలో రూ.1.59 లక్షల కోట్ల వసూళ్లు నమోదవ్వగా.. అప్పటితో పోలిస్తే ఈసారి 10 శాతం మేర పెరగడం గమనార్హం. జులై మాసంలో రూ.1.82లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు వచ్చాయని తెలిపింది. ఆగస్టులో దేశీయ వ్యాపార కార్యకలాపాల ద్వారా స్థూల జీఎస్‌టీ వసూళ్లు 9.2శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతుల ద్వారా జీఎస్‌టీ ఆదాయం 12.1శాతం మేర పెరగడంతో రూ.49,976 కోట్లకు చేరింది. ఆగస్టులో రూ.24,460 కోట్ల విలువైన రీఫండ్‌లు జారీ అయ్యాయనీ.. గతేడాదితో పోలిస్తే ఇది 38 శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu