Ad Code

సీఎం సహాయనిధికి రూ.25 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేసిన నటులు మోహన్ బాబు, మంచు విష్ణు !


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును టాలీవుడ్ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు హీరో మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సీఎం సహాయనిధి కింద విరాళంగా రూ.25 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేసినట్లు సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు పోస్ట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ సీఎం ను కలిసే భాగ్యం దక్కింది. చంద్ర బాబు నాయుడు గారికి రూ. 25 లక్షల చెక్కును ఏపీ వరద బాధితుల సహాయ నిధికి అందించాం. అదేవిధంగా కన్నప్ప గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. నా ఆర్ట్‌వర్క్‌పై ఆయన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. ఆయనకి మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నాను” అని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu