ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆయుష్మాన్ భవ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం అందించనున్నారు. దీంతో 4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వేర్వేరు పథకాల్లో రిజిస్టర్ అయి ఉన్న వృద్ధులు సైతం ఆయుష్మాన్ భారత్‌లో లబ్ధి పొందొచ్చు. అలాగే హైడ్రో పవర్ కోసం రూ.121,471 కోట్లు కేటాయించింది. 31, 359 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది.
0 Comments