Ad Code

త్వరలోనే అందుబాటులోకి 9 క్యారెట్ల గోల్డ్‌ ?


భరణాల తయారీలో 22-క్యారెట్లు, 18-క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారన్న సంగతి కూడా తెలిసిందే. అయితే, కేంద్రం త్వరలో 9-క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో కేంద్రప్రభుత్వం ప్రతినిధులు మంగళవారం భేటీ అయినట్టు జాతీయ పత్రిక 'మింట్‌’ ఓ కథనంలో వెల్లడించింది. 24-క్యారెట్ల తులం బంగారం రూ.73 వేలకు పైబడి పలుకుతున్నది. 22-క్యారెట్ల తులం బంగారం ధర కూడా రూ.68 వేల పైమాటే. దీంతో దొంగలు తమ చేతివాటం చూపుతున్నారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. 2021తో పోలిస్తే, 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం మేర పెరిగాయి. దీంతో చవక బంగారంపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం 9-క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 9 క్యారెట్ల తులం బంగారం ధర రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 24-క్యారెట్లు, 22-క్యారెట్ల బంగారం నాణ్యతను ధ్రువీకరించేందుకు ఉద్దేశించిన హాల్‌మార్క్‌, బీఎస్‌ఐ ముద్రలు ఈ బంగారంపై కూడా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 35 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45.5 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకొన్నది. స్విట్జర్లాండ్‌, యూఏఈ, పెరూ, ఘనా దేశాల నుంచి భారత్‌ ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకొంటున్నది.

Post a Comment

0 Comments

Close Menu