హైదరాబాద్ లో బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కిచుకొని కాలేజీకి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో అదే కళాశాలకు చెందిన మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న బస్సులోని డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చారు.
0 Comments