ఆంధ్రప్రదేశ్ లోని భీమిలి సముద్ర తీరంలో సీఆర్ జడ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాల చేపట్టారంటూ ఎంపీ విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చి వేశారు. సర్వే నెం.1516, 1517, 1519, 1523 లను ఆక్రమించి నేహారెడ్డి ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టారని అధికారులు గుర్తించారు. దీంతో వారు ఇవాళ ఉదయం జేసీబీ సాయంతో కూల్చివేతలు చేపట్టారు. ఇటీవల జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆ నిర్మాణాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎంపీ కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఆర్ జడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు చేసింది. ఈ క్రమంలోనే కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. భీమిలి సముద్ర తీర పరిధిలో ఓ కంపెనీ నుంచి సుమారు మూడున్నర ఎకరాలు కొనుగోలు చేసిందని తెలిపారు. అదే స్థలాన్ని విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కొనుగోలు చేసింద పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి సముద్రానికి అతి సమీపంలో కాంక్రీట్ నిర్మాణం చేశారని, ఇసుక తిన్నెలను కూడా తొలగించి చదును చేశారని ఆరోపించారు. అందుకే తాను ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా పేర్కొన్నారు.
0 Comments