Ad Code

డ్యాన్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్‌ తొలగింపు !


జానీ మాస్టర్‌ను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఫిల్మ్ ఛాంబర్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్‌ను దూరంగా ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్‌, హిందీ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మా స్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆయన గ్రూప్‌లోని మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు తనపై అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. అంతేకాకుండా నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా జానీ మాస్టర్‌పై పోలీసులు సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలు 2017లో ఢీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే 2019లో జానీ మాస్టర్ బాధితురాలికి కాల్ చేసి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేయమని అడిగినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా జాయిన అయిన దగ్గర నుంచి జానీ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని, కారవ్యాన్‌లో ప్యాంట్ జీప్పు విప్పి తన కోరికలు తీర్చమనేవాడని, తీర్చకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాలని బాధితురాలు చెబుతుంది. అయితే జానీ మాస్టర్ భార్యకు కూడా ఇందులో భాగం ఉందని బాధితురాలు ఆరోపించడం కొసమెరుపు. వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. 

Post a Comment

0 Comments

Close Menu