పీపీఎఫ్ మరియు ఎన్‌ఎస్‌సీతో సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా వచ్చింది. ఎలాంటి మార్పులు చేయలేదని సోమవారం కేంద్రం ప్రకటించింది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి పథకాలపై వడ్డీ రేట్లను సవరించకపోవడం వరసగా ఇది మూడోసారి. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో కొనసాగిన వడ్డీ రేట్లే మూడో త్రైమాసికంలోనూ కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఎప్పటిలానే 8.2 శాతం వడ్డీ లభించనుంది. మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ పథకానికి 7.1 శాతం, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌పై 4 శాతం వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర పథకంపై 7.5 శాతం లభిస్తుంది. 115 నెలల్లో గడువు తీరుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7 శాతం, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ 7.4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రముఖ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్స్ స్కీమ్‌ల వడ్డీ రేట్లు కూడా వరుసగా 7.1 శాతం మరియు 4 శాతం దగ్గర ఉంచింది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతం ఉండనుంది. ప్రధానంగా పోస్టాఫీసులు మరియు బ్యాంకుల ద్వారా నిర్వహించబడే చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో తెలియజేస్తుంది. మొత్తానికి సోమవారం వడ్డీ రేట్ల పాత పద్ధతిలోనే ఉంచింది.
0 Comments