Ad Code

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌


ద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. దీనిపై గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సెప్టెంబరు 10న తీర్పు వెలువరించినున్నట్టు వెల్లడించింది. దీంతో దిల్లీ సీఎం మరికొన్ని రోజులు జైల్లోనే ఉండనున్నారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ  కేసులో తన అరెస్టును సవాల్‌ చేయడంతో పాటు.. బెయిల్‌ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్‌ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదిస్తూ.. సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ''మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎంను అరెస్టు చేయలేదు. ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్‌ వచ్చిందో.. వెంటనే సీబీఐ 'ఇన్స్యూరెన్స్‌' అరెస్టుకు పాల్పడింది. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదు'' అని కోర్టుకు వివరించారు. ఈ వాదనల అనంతరం సీబీఐ తీరుపై ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఆ నిబంధన ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. మరోవైపు, కేజ్రీవాల్ బెయిల్‌ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆయన సెషన్స్‌ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu