Ad Code

ఆర్మీ వాహనం లోయలో పడి నలుగురు సైనికులు దుర్మరణం ?


శ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్‌ నుంచి సిక్కింలోని జులుక్‌కు వెళ్తుండగా ఆర్మీ వాహనం లోతైన లోయలో పడటంతో నలుగురు సైనికులు దుర్మరణం చెందారు. ఆర్మీ వాహనం కఠినమైన పర్వత మార్గంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో సిల్క్ రూట్‌లో ఈ ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి 700 నుంచి 800 అడుగుల దిగువన ఉన్న లోయలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. సిల్క్ రూట్ అని పిలువబడే రీనాక్ రోంగ్లీ రాష్ట్ర రహదారిపై దలోప్‌చంద్ దారా సమీపంలోని వర్టికల్ వీర్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లను అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే.. అప్పటికే నలుగురు జవాన్లు మృతి చెందారు. చనిపోయిన సైనికులు మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ ప్రదీప్ పటేల్, మణిపూర్‌కు చెందిన క్రాఫ్ట్‌మెన్ డబ్ల్యూ పీటర్, హర్యానాకు చెందిన నాయక్ గుర్సేవ్ సింగ్, తమిళనాడుకు చెందిన సుబేదార్ గా గుర్తించారు. వారంతా పశ్చిమ బెంగాల్‌లోని బినాగురికి చెందిన యూనిట్‌కు చెందినవారు.

Post a Comment

0 Comments

Close Menu