Ad Code

సిట్ పై మాకు నమ్మకం లేదు : గుడివాడ అమర్నాథ్


విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ  లడ్డు వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది ఆ కనుకనే రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆధ్యుడైన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలకు పునాదులు వేసి చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి టిడిపి అల్టిమేట్ ఇవ్వాలి. టిడిపి మద్దతు నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించాలన్నారు. తిరుమల తిరుపతి పవిత్ర మీద రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటిదో ఎక్సైజ్ షాపులు కేటాయిస్తూ చేస్తే అర్థం అవుతుందని విమర్శించారు. ఒక తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులు ఇచ్చారని అమర్నాథ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం విచారణ జరిపిస్తున్నట్టువంటి సిట్ పై తనకు నమ్మకం లేదని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu