Ad Code

బుడమేరు గండ్లను పరిశీలించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌


విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్‌ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్‌ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్‌ నగర్‌లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ కేంద్ర మంత్రికి వివరించారు. ఏరియల్‌ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించనున్నారు. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ బోట్‌లో వెళ్లి పరిశీలించనున్నారు. విజయవాడ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి తిలకించనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.

Post a Comment

0 Comments

Close Menu