Ad Code

'ఢిల్లీలో మీ స్నేహితులు..' అంటూ కామెంట్‌ చేయాల్సిన అవసరం ప్రకాశ్‌రాజ్‌కు లేదు : పవన్‌ కల్యాణ్‌


'ప్రకాశ్‌రాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు సరిగానే అర్థమైంది' అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్‌ కల్యాణ్‌ అన్నారు.  తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పెట్టిన ఓ పోస్ట్‌లో పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి 'మీ వ్యాఖ్యలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు' అని ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేయడం దుమారం రేపింది. దీనిపై తాజా ఇంటర్వ్యూలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ 'భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను స్పందిస్తే 'ఢిల్లీలో మీ స్నేహితులు..' అంటూ కామెంట్‌ చేయాల్సిన అవసరం ప్రకాశ్‌రాజ్‌కు లేదు. ఆయన పోస్ట్‌ను నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు సరిగానే అర్థమైంది' అని చెప్పారు. 'ప్రకాశ్‌రాజ్‌ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా దారులు వేరైనా మా మధ్యన ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. ఆయనతో కలసి పనిచేయడం నాకు ఇష్టం' అని కూడా పవన్‌ చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu