Ad Code

చీపురు పట్టి ఊడ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు !


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నేషనల్‌ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu