Ad Code

జార్ఖాండ్‌ లో రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు !


జార్ఖాండ్‌ లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బొగ్గు రవాణాకు వినియోగిస్తున్న రైల్ ట్రాక్‌లో కొంత భాగాన్ని పేల్చేశారు. ఈ ఘటనలో క్రిమినల్ గ్యాంగ్ ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నట్టు సాహిజ్ గంజ్ ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ తెలిపారు. విచారణ చేపట్టినట్టు చెప్పారు. దండగులు పేల్చేసిన రైల్ ట్రాక్ ఇండియన్ రైల్ నెట్ వర్క్‌కు చెందినిది కాదని, ఎన్‌టీపీసీకి చెందినదని చెప్పారు. గోల్డాలోని లాల్‌మిటియా నుంచి పశ్చిమబెంగాల్‌లోని ఫరాక్కాలోని తమ పవర్ స్టేషన్‌కు బొగ్గు రవాణా చేసేందుకు ఈ ట్రాక్‌ను ఎన్‌టీపీ వినియోగిస్తునట్టు చెప్పారు. కాగా, కొందరు దుండగులు రైల్వే ట్రాక్‌ను పేల్చివేయడంతో సుమారు 470 సెంటీమీటర్ల ట్రాక్ దెబ్బతిందని పోలీసులు తెలిపారు. లాల్‌మిటియా నుంచి ఫరక్కా వెళ్లే దారిలోని ఎంజీఆర్ రైల్వే లైన్‌పై ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. అయితే బాంబు పేలుడులో ఎలాంటి ఆస్తినష్టం కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదని చెప్పారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా ఘటనా స్థలికి రప్పించి, అన్ని కోణాల్లోంచి విచారమ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. దుండగులు రైల్వే ట్రాక్‌ను పేల్చివేసిన విషయాన్ని తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న పలువురు గ్రామస్థులు గమనించి, ఎన్టీపీసీకి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu