తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ధర్మాసనం విచారణను 3వ తేదీ వరకు వాయిదా వేసింది. అలాగే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలా..? లేదా..? అనే విషయంపై కూడా అప్పుడే క్లారిటీ ఇస్తామని వ్యాఖ్యానించడమే కాకుండా సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని, ఈ నెల 3వ తేదీన సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందుకెళ్లడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.
0 Comments