ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి గత నెలతో ముగిసింది. అయితే మరో పది రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరగా, ప్రైవేట్ వైన్ షాపులు వస్తున్నాయని పది రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవనే కారణంతో విధుల్లోకి రాలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా వైన్ షాపులు మూతపడ్డాయి. అక్టోబర్ 12 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. వైన్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 11న మొత్తం 3,396 వైన్ షాపులకు లాటరీ తీస్తారు. టెండర్ దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలు కాగా వైన్ షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజుల కింద రూ. 50 నుంచి 85 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
0 Comments