ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిషాత్‌గంజ్‌కు చెందిన భరత్ సాహు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా భరత్ ఐఫోన్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు ఇందిరా కాలనీకి వెళ్లాడు. రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను గజానన్ అనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ ఆర్డర్ చేశాడు. దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆ ఐఫోన్ డెలివరీ చేసేందుకు భరత్ దగ్గరికి వెళ్లాడు. ఆ ఐఫోన్ డెలివరీ చేయగానే డబ్బులు చెల్లించామని గజానన్‌ను అడిగాడు. దాంతో సాహును మరో వ్యక్తితో కలిసి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అతడి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇందిరా కెనాల్‌లో పారేశారు. సాహు రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో సెప్టెంబర్ 25న చిన్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాహు కాల్ వివరాలను స్కాన్ చేసి అతని లొకేషన్‌ను కనుగొనే ప్రయత్నంలో, పోలీసులు గజానన్ నంబర్‌ను కనుగొని అతని స్నేహితుడు ఆకాష్‌ను విచారించారు. విచారణలో ఆకాష్ నేరం అంగీకరించాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ శశాంక్ సింగ్ వెల్లడించారు. మృతుడి సోదరుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. “నా సోదరుడు ఒక ప్రొడక్టు డెలివరీ చేయడానికి వెళ్ళాడు. అతను డెలివరీ చేసిన ప్రొడక్టు ధరను డిమాండ్ చేసినప్పుడు కస్టమర్ నా సోదరుడిని చంపాడు. నా సోదరుడికి న్యాయం చేయాలి. అతనికి వివాహం జరిగింది” అని వాపోయాడు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. “మా డెలివరీ ఏజెంట్‌తో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన పట్ల చింతిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా ఉంటాం. డెలివరీ ఏజెంట్ కుటుంబానికి సాధ్యమైన సహాయాన్ని అందిస్తాం. పోలీసుల విచారణలో కూడా మావంతుగా సహకరిస్తాం” అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
0 Comments