నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరో హీరోయిన్ల ప్యాన్ ట్యాపింగ్ చేసింది కేటీఆరే అన్నారు. అందరికీ మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా ఆయనే అంటూ మండిపడ్డారు. వాళ్ల జీవితాలతో ఆడుకొని వాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది కేటీఆర్ కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మాారాయి. మరోవైపు కొండా సురేఖ చేసిన కామెంట్లపై కేటీఆర్ వెంటనే స్పందించారు. నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా అన్నారు. కొండా సురేఖ నాపై ఏడుస్తున్నారన్నారు. మాకు సంబంధం లేని వ్యవహారంలో మమ్మల్ని లాగుతున్నారన్నారు. ఇప్పుడు కొండా సురేఖ వచ్చి నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అనడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురయ్యారు. కేటీఆర్ ఆ విషయంతో సంబంధం లేని వ్యవహారం అన్నప్పటికీ కొండా సురేఖ కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
0 Comments