ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో రేపు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో విచారణలో భాగంగా ఇటీవల జోగి రమేష్ మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి హాజరైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటి వరకు రెండు సార్లు విచారణను ఎదుర్కొన్నారు ఆయన. గతంలో నోటీసుల్లో ఇచ్చిన తేదీన వెళ్లకుండా కొద్దీ రోజుల తరువాత విచారణకు వెళ్లారు. మరి రేపు ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.
0 Comments