Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label ప్రైవేట్ టెల్కోలు - ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు. Show all posts
Showing posts with label ప్రైవేట్ టెల్కోలు - ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు. Show all posts

Thursday, April 14, 2022

ప్రైవేట్ టెల్కోలు - ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు


ప్రైవేట్ టెల్కోలు ఇటువంటి ప్లాన్లకు డేటా ప్రయోజనాలతో పాటుగా OTT ప్లాట్‌ఫారమ్‌లకు కూడా ఉచిత యాక్సెస్ ను అందిస్తున్నాయి. అయితే నెల నెల మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ఇష్టపడకుంటే టెల్కో 3,6,12 నెల చెల్లుబాటులతో కొన్ని ప్లాన్ లను అందిస్తున్నాయి. ప్రీమియం ఇయర్‌లాంగ్ ప్లాన్‌లలో టెల్కోలు రూ.3000 కంటే ఎక్కువ ధరతో అందిస్తున్నాయి. రిలయన్స్ జియో టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.3000 కంటే అధిక ధర వద్ద రెండు ప్లాన్ లను అందిస్తున్నది. ఈ ఖరీదైన ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్‌తో పాటుగా రోజువారీ డేటా ప్రయోజనంను అందిస్తుంది. రూ.4,199 ధర ట్యాగ్‌తో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ 365 రోజుల చెల్లుబాటు వ్యవధికి రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.499 విలువైన 1-సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. వీటితో పాటుగా జియో సినిమా మరియు జియో టీవీ వంటి జియో అప్లికేషన్‌లకు కూడా ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. జియో వెబ్‌సైట్‌లో 'క్రికెట్ ప్లాన్' కింద మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. రూ. 3,119 ధర ట్యాగ్‌తో 365 రోజుల చెల్లుబాటుతో లభించే ఈ ప్లాన్‌ వినియోగదారులకు రోజుకు 2GB డేటాను అందిస్తుంది. దీనితో పాటుగా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.499 విలువైన 1-సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా 10GB డేటాను కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ టెల్కో రూ.3,000 కంటే ఎక్కువ ధరతో కేవలం ఒకే ఒక ప్లాన్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది కూడా జియో మాదిరిగానే డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత ప్రయోజనంతో లభిస్తుంది. ఎయిర్‌టెల్ సంస్థ రూ.3,359 ధరతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇది 365 రోజుల చెల్లుబాటు వ్యవధికి రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటు రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌కు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీనితో వినియోగదారులు ప్రస్తుత IPL మ్యాచ్ లైవ్ , సినిమాలు, హాట్‌స్టార్ ఒరిజినల్స్ వంటి మరిన్నింటిని చూడవచ్చు. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్ ప్రీమియం మరియు కొన్ని ఇతర యాప్‌ల మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్‌కు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా(Vi) కూడా రూ.3,000 కంటే ఎక్కువధరతో కేవలం ఒకే ఒక ప్లాన్‌ను మాత్రమే అందిస్తుంది. ధరల విషయానికి వస్తే వాస్తవానికి జియో మరియు ఎయిర్‌టెల్ రెండింటి కంటే కొంచెం సరసమైనది. రూ.3,099 ధర ట్యాగ్‌తో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ 365 రోజుల చెల్లుబాటు వ్యవధికి రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా Disney+ Hotstar మొబైల్‌కి 1-సంవత్సర యాక్సెస్‌తో వస్తుంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే టెల్కో చాలా ప్రత్యేకమైన ఆఫర్‌లను అందిస్తుంది. "బింగే ఆల్ నైట్" ప్రయోజనంతో వినియోగదారులు అర్ధరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమిత ఇంటర్నెట్ ను పొందవచ్చు. అదనంగా Vi "వీకెండ్ రోల్ ఓవర్" ఫీచర్‌ను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఉపయోగించని రోజువారీ డేటాను సోమవారం-శుక్రవారం నుండి శనివారం మరియు ఆదివారం వరకు ఫార్వార్డ్ చేయవచ్చు. ఇది కాకుండా Vi ప్రతి నెలా 2GB వరకు అదనపు బ్యాకప్ డేటాను కూడా అందిస్తుంది. ఇది ఎటువంటి ఖర్చు లేకుండా వస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే వినియోగదారులు ఈ ప్లాన్‌తో Vi మూవీస్ మరియు టీవీకి యాక్సెస్ పొందుతారు. దీని ద్వారా వారు యాప్‌లో సినిమాలు, మ్యూజిక్, లైవ్ టీవీ మరియు మరిన్నిటిని ఆస్వాదించవచ్చు.

Popular Posts