Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label మీడియాటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్. Show all posts
Showing posts with label మీడియాటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్. Show all posts

Tuesday, May 23, 2023

లావా అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ప్రారంభం !


లావా అగ్ని 2 5G ఫస్ట్ సేల్ రేపు ఉదయం 10 గంటలకి మొదలవుతుంది. కర్వ్డ్ డిస్ప్లే, ఫాస్ట్ 5G ప్రోసెసర్ తో లావా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే మంచి హైప్ ను సంపాదించుకుంది. ఈ ఫోన్ వారెంటీలో భాగంగా లావా తెలిపిన ఫోన్ రీప్లేస్మెంట్ అఫర్, భారతీయ యూజర్లను ఆకట్టుకుంటోదని కూడా చెబుతున్నారు. లావా అగ్ని 2 5G స్మార్ట్ ఫోన్ ను లావా రూ. 21,999 రేటుతో లాంచ్ చేసింది. అయితే, లంచ్ ఆఫర్ లో భాగంగా అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 2,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ఈ ఫోన్ పైన అందించింది.  లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఇండియాలో లాంచ్ అయిన మొదటి ఫోన్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో FHD+ రిజల్యూషన్ కలిగిన Curved AMOLED (6.78 ఇంచ్) డిస్ప్లేతో ఉంటుంది. ఇది HDR 10+ సర్టిఫికేషన్ మరియు ఓలియోఫోబిక్ కోటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నగా కనిపిస్తుంది మరియు 3D డ్యూయల్ కర్వ్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ లో మీరు 8GB ర్యామ్ ని 8GB వర్చువల్ ర్యామ్ మరియు భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమేరా సెటప్ 50MP మైన్ కెమేరా సెటప్ తో కలిగి వుంది. లావా ఈ లేటెస్ట్ ఫోన్ లో వేగవంతమైన 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా ఈ ఫోన్ లో జత చేసింది. 

Popular Posts