Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో వైద్య నిపుణులు. Show all posts
Showing posts with label లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో వైద్య నిపుణులు. Show all posts

Friday, January 6, 2023

కేన్సర్‌ను ఐనైఫ్‌ పసిగట్టేస్తుంది !


కేన్సర్‌ చికిత్సలను త్వరితగతిని అందించి ఎందరో మహిళల ప్రాణాలను కాపాడే అవకాశం ఐనైఫ్‌ ద్వారా వచ్చిందని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో వైద్య నిపుణులు చెప్పారు. సాధారణంగా మహిళల్లో వచ్చే ఎండోమెట్రియల్‌ కేన్సర్‌ను గుర్తించడం ఆలస్యం అవడం వల్ల దుష్ప్రభావాలు అధికం. అయితే ఈ ఐనైఫ్‌తో సెకండ్లలో కేన్సర్‌ను గుర్తించగలుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. వివరాలను జర్నల్‌ కేన్సర్స్‌లో ప్రచురించారు. గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు అనుమానం ఉన్న 150 మంది మహిళల టిష్యూ శాంపిల్స్‌ను సర్జికల్‌ కత్తితో పరీక్షిస్తే సెకండ్లలోనే ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ పద్ధతిలో చేసిన ఫలితాలతో పోల్చి చూస్తే 86% ఫలితాలు సరిగ్గా ఉన్నాయని ఆ అధ్యయనం వివరించింది. 

Popular Posts