ట్విటర్‌లో ఏదైనా రాసి పోస్ట్ చేయాలనుకుంటే కేవలం 280 అక్షరాలు మాత్రమే రాయగలం. అంతకు మించి క్యారెక్టర్లు రాయాలనుకుంటే మరో ట్వీట్ చేయాల్సిందే. అయితే, అక్షరాల పరిమితిని 280 నుంచి 2,500కు పెంచాలని ట్విటర్ యోచిస్తోంది. ఈ మేరకు నోట్స్ పేరిట కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే యూజర్లు తమ సుదీర్ఘ సందేశాలను పోస్టు చేయొచ్చు. దాంతో పాటు ఫొటోలు, వీడియోల వంటివి కూడా జోడించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ట్విటర్ టైమ్ లైన్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు చేసే ఈ సుదీర్ఘ ట్వీట్ ప్రివ్యూను కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఘనాల్లో ప్రయోగాత్మకంగా ట్విటర్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నోట్‌ను షేర్ చేసుకోవాలనుకునేవారి కోసం అందుకోసం ప్రత్యేకంగా లింక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. 2017 కంటే ముందు ట్విటర్‌లో క్యారెక్టర్ల పరిమితి 140గా ఉండేది. అయితే, అనంతరం ఆ పరిమితిని 280కి పెంచారు.
Search This Blog
Showing posts with label 500కు. Show all posts
Showing posts with label 500కు. Show all posts
Thursday, June 23, 2022
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...