Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label 999గా ఉంది. Show all posts
Showing posts with label 999గా ఉంది. Show all posts

Sunday, September 17, 2023

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీపై తగ్గింపు ధర !

 


న్‌ప్లస్‌ మొబైల్ కంపెనీ జులైలో ‘నార్డ్‌ 3 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇది శక్తివంతమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. అద్భుతమైన కెమెరా, పెద్ద డిస్‌ప్లే, సూపర్ బ్యాటరీతో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. నార్డ్‌ 3 5జీ అమ్మకాలు భారీగా ఉన్నాయి. ఆరంభంలో అయితే ‘నో స్టాక్’ బోర్డు ఉండేది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. దాంతో నార్డ్‌ 3 5జీని పది వేల లోపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 33999. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ధర ఉంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 24900 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ వర్తిస్తే ఈ ఫోన్ మీకు రూ. 9,099కి సొంతం అవుతుంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుండా లేటెస్ట్ వెర్షన్ అయితేనే ఈ పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ లభిస్తుంది. లేదంటే తక్కువ ఎక్స్‌ఛేంజ్‌ వస్తుంది.  నార్డ్‌ 3 5జీ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. అమెజాన్‌, అధికారిక వన్‌ప్లస్‌ స్టోర్‌ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేసినవారికి మాత్రమే నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ను ఉచితంగా ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ బడ్స్‌ కంపెనీ అందిస్తున్న ఎంట్రీ- లెవెల్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌. ఛార్జింగ్‌ కేస్‌తో కలిపి ఈ బడ్స్‌ బ్యాటరీ లైఫ్‌ 40 గంటలు. ఈ బడ్స్‌ 2ఆర్‌ ధర భారత్‌లో రూ.2,199. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ ఫోన్‌ రెండు వేరియంట్లలో భారత్‌లో అందుబాటులో ఉంది. 8GB + 128GB ధర రూ.33,999 కాగా.. 16GB + 256GB ధర 37,999గా ఉంది. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9,000 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌13తో వస్తోంది. 120Hz రీఫ్రెస్‌ రేట్‌ ఉన్న 6.74 అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉంటాయి. 80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Sunday, July 2, 2023

షావోమి 75 ఇంచుల స్మార్ట్‌టీవీపై రూ.60 వేలు డిస్కౌంట్!


షావోమి75 ఇంచుల క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీపై  భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. పలు రకాల డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది.  ఎంఐ.కామ్ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 75 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ ఉంది. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 1,99,999గా ఉంది. అయితే మీరు దీన్ని రూ. 1,44,999కు కొనొచ్చు. అంటే మీకు నేరుగానే రూ. 55 వేల డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొంటే అదనంగ రూ. 5 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే అప్పుడు మొత్తంగా రూ. 60 వేల తగ్గింపు పొందొచ్చు. అలాగే ఈ స్మార్ట్ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. వడ్డీ లేకుండా సులభ ఈఎంఐలో టీవీ కొనొచ్చు. ఏడాది వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే మీరు బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కూడా ఈ టీవీని కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనం పొందొచ్చు. అలాగే ఈ టీవీ కొనుగోలుపై ఫ్రీ డెలివరీ, ఫ్రీ ఇన్‌స్టాలేషన్, ఎక్సెండెట్ వారంటీ వంటివి కూడా లభిస్తున్నాయి. 10 రోజుల రిప్లేస్‌మెంట్ పాలసీ ఉంటుంది. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, హ్యాండ్స్ ఫ్రీ గూగుల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 30 వాట్ డాల్బే ఆడియో, 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, డాల్బే విజన్, హెచ్‌డీఆర్ 10 ప్లస్, హెచ్ఎల్జీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ డిస్నీ, జీ 5, నెట్‌ఫ్లిక్స్ , సోనీ లివ్ వంటి పలు రకాల ఓటీటీ యాప్స్ చూడొచ్చు. అయితే వీటికి సబ్‌స్క్రిప్షన్ తీసుకొని ఉండాలి. అలాగే యూట్యూబ్ కూడా వస్తుంది. https://t.me/offerbazaramzon

Popular Posts