Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label Banking. Show all posts
Showing posts with label Banking. Show all posts

Saturday, July 23, 2022

కెనరా ఏఐ1 పేరుతో యాప్‌ విడుదల !

 


కెనరా బ్యాంక్‌ సరికొత్త ఫీచర్లతో 'కెనరా ఏఐ1' యాప్‌ను లాంఛ్‌ చేసింది. ఈ యాప్‌లో అద్భత ఫీచర్లను పొందుపరిచారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కెనరా ఈ యాప్‌ను ప్రారంభించినట్లు కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. 'కెనరా ఏఐ1' యాప్‌ను లాంఛ్‌ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 250కుపైగా ప్రత్యేకతలతో కూడిన ఈ యాప్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు వన్‌స్టా్‌ప సొల్యూషన్‌గా సేవలందిస్తుందన్నారు ఎల్‌వీ ప్రభాకర్‌. బ్యాంకింగ్‌ సేవల కోసం ఇకపై వేర్వేరు యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు ఎల్‌వీ ప్రభాకర్‌. యుఐ, యుఎక్స్‌ వంటి అడ్వాన్స్‌ ఫీచర్స్‌ ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు ఎల్‌వీ ప్రభాకర్‌. ఇప్పటికే 35 లక్షల మంది కెనరా ఏఐ1 సూపర్‌ యాప్‌ను వినియోగిస్తున్నారని వెల్లడించారు ఎల్‌వీ ప్రభాకర్‌. అత్యాధునిక ఆప్షన్‌లను ఇందులో పొందుపరిచినట్లు ఎల్‌వీ ప్రభాకర్‌ వివరించారు.


Wednesday, June 8, 2022

క్రెడిట్ కార్డ్స్‌కు యూపీఐ లింకింగ్ ?


క్రెడిట్ కార్డులను యూపీఐ అకౌంట్లకు లింక్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్ఫామ్ చేసింది. ముందుగా రూపే కార్డులను లింక్ చేసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ, వీసా, మాస్టర్ కార్డుల్లాంటి ఇతర నెట్‌వర్క్‌లకు ఓకే చెప్పనుంది. ఇప్పటివరకూ కస్టమర్లు డెబిట్ కార్డులు మాత్రమే యూపీఐతో లింక్ చేసుకునేవారు. మానిటరీ పాలసీ స్పీచ్‌లో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ప్రకటన చేశారు. “సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్స్ మాత్రమే యూపీఐతో లింక్ అయి ఉండేవి. ఇప్పుడు యూపీఐ ప్లాట్ ఫాంపై క్రెడిట్ కార్డ్స్‌ను కూడా జత చేయనున్నారు. దీనిని రూపే క్రెడిట్ కార్డ్స్ తో ఆరంభించనున్నారు. దీంతో యూజర్లకు డిజిటల్ పేమెంట్స్ విషయంలో అదనపు సౌకర్యం చేకూరనుంది” అని వెల్లడించారు. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎటువంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుందనేది స్పష్టత రాలేదు. ప్రతి లావాదేవీపై, వ్యాపారి లావాదేవీ మొత్తంలో కొంత శాతాన్ని చెల్లిస్తారు. జనవరి 1, 2020 నుంచి అమల్లోకి వచ్చిన నియమం ప్రకారం.. UPI రూపే పేమెంట్ సున్నా-MDRతో జరుగుతాయి. అంటే ఈ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు వర్తించవు. దేశవ్యాప్తంగా వ్యాపారులు UPIని విస్తృతంగా స్వీకరించడానికి ఇదే ప్రధాన కారణం.

Friday, March 11, 2022

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు?


ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పై భారత రిజర్వ్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొన్ని మెటీరియల్ సూపర్ వైజరీ సమస్యల కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ సంస్థకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దంటూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం ఐటీ సిస్టమ్స్ పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ పూర్తి చేసేంతవరకు ఐటీ అడిట్ సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. పేటీఎం బ్యాంకులో సూపర్ వైజరీ సమస్యలు ఉన్నాయని ఆర్బీఐ దృష్టికి వచ్చింది. పేటీఎం  పేమెంట్స్ బ్యాంకులో శర్మ సొంతంగా 51శాతం వాటాను కలిగి ఉన్నారు. అందుకే దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించేందుకు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటలో వెల్లడించింది. ఈ క్రమంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఐటీ సిస్టమ్‌పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించేందుకు ఐటీ ఆడిట్ సంస్థను నియమించాల్సిందిగా ఆదేశించినట్లు ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం అనేది IT ఆడిటర్ల నివేదికను సమీక్షించిన తర్వాతే జరగాల్సి ఉంది. అది కూడా RBI మంజూరు చేసే నిర్దిష్ట అనుమతికి లోబడి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

Friday, December 3, 2021

బ్యాంకింగ్ యాప్ వాడుతున్నారా?


Who's using bank apps? And why and how? - Banking Exchange 

మీ బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని ఎస్‌బీఐ  హెచ్చరిస్తోంది. వీక్ పాస్‌వర్డ్స్‌తో మీ బ్యాంకు ఖాతాలకు ముప్పేనని వార్నింగ్ ఇస్తోంది. సైబర్ నేరగాళ్లు అంత సులువుగా కనిపెట్టలేని పాస్‌వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తోంది. పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉంటేనే మీ బ్యాంక్ అకౌంట్ లేదా, బ్యాంకింగ్ యాప్స్ సురక్షితంగా ఉంటాయి. యూజర్లు తాము స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ పెట్టుకున్నామనే అనుకుంటారు కానీ... చాలా సందర్భాల్లో అవి వీక్ పాస్‌వర్డ్సే ఉంటాయి. మరి పాస్ వర్డ్ ఎలా ఉండాలి? ఎలాంటి పాస్‌వర్డ్స్ పెట్టుకోవద్దు? పాస్‌వర్డ్ సెట్ చేసుకునేముందు ఏఏ టిప్స్ పాటించాలి? తెలుసుకోండి. అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్ కలిపి పాస్‌వర్డ్ పెట్టాలి. ఉదాహరణకు పాస్‌వర్డ్‌లో ABCD..., abcd..., 1234.. లాంటి కాంబినేషన్ ఉండాలి. కేవలం అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్ మాత్రమే పాస్‌వర్డ్ పెట్టొద్దు. కాంబినేషన్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. పాస్‌వర్డ్‌లో @_+= లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే పాస్‌వర్డ్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంటే అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్‌తో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ కలిపితే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అవుతుంది. పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్లు ఉండాలి. ఆ 8 క్యారెక్టర్లలో పైన చెప్పినవన్నీ అంటే అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కలిపి ఉండాలి. 12 క్యారెక్టర్ల వరకు పాస్‌వర్డ్ పెట్టినా మంచిది. అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే గుర్తుంచుకోవడం కష్టం. కామన్ వర్డ్స్ పాస్‌వర్డ్‌గా పెట్టొద్దు. itislocked, thisismypassword, nopassword అనే సింపుల్ పాస్‌వర్డ్స్ పెట్టొద్దు. ఇవి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అని మీరు అనుకోవచ్చు కానీ... హ్యాకర్లకు అవి చాలా సింపుల్ పాస్‌వర్డ్స్. ఇక కీబోర్డ్‌లో సింపుల్‌గా గుర్తుంచుంది కదా అని qwerty, asdfg లాంటి పాస్‌వర్డ్స్ అస్సలు పెట్టొద్దు. మీ పాస్‌వర్డ్ పటిష్టంగా ఉండాలంటే :), :/ లాంటి ఎమోషన్స్‌ని పాస్‌వర్డ్‌లో యాడ్ చేయాలి.  ఇక 12345678, abcdefg లాంటి ఈజీ పాస్‌వర్డ్స్ పెడితే మీకు రిస్కే. బ్యాంక్ అకౌంట్ కాకుండా మీరు ఎప్పుడో ఓసారి ఉపయోగించే అకౌంట్ అయినా పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. వీటితో పాటు DOORBELL బదులు DOOR8377 లాంటి సబ్‌స్టిట్యూట్ పాస్‌వర్డ్స్ కూడా పెట్టొద్దని చెబుతోంది ఎస్‌బీఐ. పాస్‌వర్డ్ చాలా పెద్దగా ఉండాలి కదా అని పేరును, పుట్టిన తేదీ లేదా సంవత్సరాన్ని పాస్‌వర్డ్‌లో పెట్టొద్దు. ఉదాహరణకు Ramesh@1967 అనే పాస్‌వర్డ్ ఉండొద్దు. బ్యాంక్ అకౌంట్, బ్యాంకింగ్ యాప్స్ మాత్రమే కాదు... వ్యక్తిగత అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్‌కు కూడా ఇవే పాస్‌వర్డ్ టిప్స్ ఫాలో కావొచ్చు. ఏ పాస్‌వర్డ్ అయినా ఇతరులు ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు సులువుగా గుర్తించలేనిదై ఉండాలి. 

Wednesday, November 10, 2021

ఎస్ బి ఐ అలర్ట్...!


ఇప్పటికే ఈ నాలుగు యాప్స్ కారణంగా 150 మందికి పైగా ఎస్ బి ఐ ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. అందుకే, ఎస్ బి ఐ  కస్టమర్లు వారి ఫోన్లలో ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది. ఈ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే మోసగాళ్లు మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారని సూచించింది. విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని, ఎనిడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూవర్ మరియు మింగిల్ వ్యూ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవద్దని ఎస్ బి ఐ  తన కస్టమర్లను హెచ్చరించింది. అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది. అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ SBI వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి. 

Tuesday, September 7, 2021

జీరో బ్యాలెన్స్ అకౌంట్ - బ్యాంకులు




ప్రస్తుతం ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల దగ్గర్నుంచి చాలా వరకు ఆర్థిక లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరుగుతున్నాయి. అందువల్ల ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. కానీ బ్యాంకు పొదుపు ఖాతా తెరవాలంటే కనీస బ్యాలెన్స్ ఉండాలి. ఖాతా ఉన్నన్ని రోజులు కనీస బ్యాలెన్స్ నిర్వహించాలి. లేదంటే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. దేశంలోని ప్రధాన బ్యాంకులలో ఖాతా తెరవాలంటే కనీసం రూ. 1000 ఉండాలి. కొన్ని బ్యాంకులలో మినిమమ్ బ్యాలెన్స్ నెలకు రూ. 5వేల నుంచి రూ.10వేల వరకు కూడా ఉంటుంది. కుటుంబ అవసరాలకు సరిపోయే మొత్తాన్ని సంపాదించుకునే వారికి కనీస బ్యాలెన్స్ నిర్వహణ భారం అవుతుంది. ఇటువంటి వారి కోసం కొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా పొదుపు ఖాతాను తెరిచేందుకు అనుమతిస్తున్నాయి. వీటినే జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా అని పిలుస్తారు. ప్రధానంగా ఆర్థికంగా వెనకపడిన వారిని ప్రోత్సహించడానికి బ్యాంకులు ఈ ఖాతాలను అందిస్తున్నాయి.

ఐడీబీఐ ఫస్ట్‌ బ్యాంక్‌..

ప్రథమ్ సేవింగ్స్ అక్కౌంట్ పేరుతో జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను అందిస్తుంది ఐడీబీఐ ఫస్ట్ బ్యాంక్‌. వడ్డీ రేటు 4శాతం. రోజుకు రూ.40వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాతో రూ. 2 లక్షల కాంప్లిమెంటరీ వ్యక్తిగత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. అయితే ఈ బ్యాంకులో జిరో బ్యాలెన్స్ ఖాతా తెరవాలంటే మరే ఇతర బ్యాంకులో పొదుపు ఖాతా ఉండకూడదు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

ఎస్‌బీఐ అందించే జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు..బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(బిఎస్‌బిడిఏ). సాధారణ బ్యాంకు పొదుపు ఖాతాల మాదిరిగానే జీరో బ్యాలెన్స్ ఖాతాలపై ఎస్‌బీఐ వడ్డీ అందిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు 2.70శాతం. కేవైసి పత్రాలు ఇచ్చి ఈ ఖాతాను తెరవచ్చు. ఎటువంటి రుసుము లేకుండా బేసిక్ రూపే ఏటీఎం- కమ్-డెబిట్ కార్డును అందిస్తుంది

యస్ బ్యాంక్‌..

ఈ బ్యాంక్‌ అందించే జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు..స్మార్ట్ శాలరీ అడ్వాంటేజ్ అక్కౌంట్‌. వడ్డీ రేటు 4 శాతం. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు మాత్రమే ఈ ఖాతాను తెరించేందుకు వీలుంటుంది. రూ.75వేల విత్‌డ్రా పరిమితితో 'ఎంగేజ్' డెబిట్ కార్డ్ ఇస్తారు. ఇది వ్యక్తిగత ప్రమాద బీమాతో వస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(బిఎస్‌బిడిఏ) పేరుతో జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను అందిస్తుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. వడ్డీ రేటు 3 శాతం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో శాలరీ ఎగ్రిమెంట్ ఉన్న సంస్థ ఉద్యోగులు మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు వీలుంటుంది. వేరొక బ్యాంకులో పొదుపు ఖాతా గానీ, శాలరీ ఖాతా గానీ ఉన్న వ్యక్తులు ఈ ఖాతాను తెరవలేరు.

కొటాక్ మహీంద్రా బ్యాంక్‌..

ఈ బ్యాంక్ అందిస్తున్న జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు - 811 డిజిట్ బ్యాంక్ అక్కౌంట్‌. వడ్డీ రేటు 3.50 శాతం. ఈ ఖాతాను బ్యాంకుకు రాకుండానే.. విడియో కేవైసీ ద్వారా తెరవచ్చు. డబ్బును నెఫ్ట్ లేదా ఐఎమ్‌పీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో బదిలీ చేయవచ్చు.

స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్‌..

ఈ బ్యాంక్ అందిస్తున్న జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు - ఆసాన్‌/బిఎస్‌బిడిఏ. వడ్డీ రేటు 2.75 శాతం. ఖాతాలో రోజువారిగా ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు. త్రైమాసికంగా చెల్లిస్తారు. ఆధార్ బేస్డ్ ఇకేవైసితో ఇన్‌స్టెంట్‌గా ఖాతాను తెరవచ్చు. నెఫ్ట్‌/ఆర్‌టీజీఎస్ లావాదేవీలను ఉచితంగా అందిస్తుంది.

ఇండస్ఇండ్ బ్యాంక్‌..

ఈ బ్యాంక్ అందిస్తున్న జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు - ఇండస్ ఆన్‌లైన్ సేవింగ్స్ అక్కౌంట్‌. వడ్డీ రేటు 4 శాతం. ఈ ఖాతాను తెరిచేందుకు.. మనుగడలో ఉన్న మొబైల్ నెంబరు ఉండాలి. ఇది ఆధార్‌కి అనుసంధానమై ఉండాలి. అలాగే పాన్ నెంబరు ఉండాలి. ఈ ఖాతాతో రూ. 2 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా లభిస్తుంది. అలాగే ప్లాటినమ్ ప్లస్ డెబిట్ కార్డు లభిస్తుంది. 

Popular Posts