Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label modi. Show all posts
Showing posts with label modi. Show all posts

Thursday, October 21, 2021

టీకాలో 100 కోట్ల మైలురాయిని దాటాం...!

 

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌ చేపట్టిన టీకా ఉద్యమం నేడు 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ''సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తి, భారత సైన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన డాక్టర్లు, నర్సులు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. టీకా పంపిణీలో 100 మైలురాయిని దాటిన సందర్భంగా మోదీ ఈ ఉదయం దిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నారు. అటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా లఖ్‌నవూలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తలను అభినందించారు. పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ట్విటర్‌ వేదికగా 100 కోట్ల మార్క్‌పై అభిందనలు తెలియజేశారు.

Saturday, September 25, 2021

స్వల్పంగా పెరిగిన మోదీ సంపద



ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు విలువ గతేడాదితో పోలిస్తే స్పల్పంగా పెరిగింది. పీఎం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తాజా గణాంకాల ప్రకారం.. మోదీ నికర ఆస్తులు రూ. 3,07,68,885కు పెరిగాయి. గతేడాది ఈ సంపద 2.85 కోట్లు ఉండగా.. ఏడాదిలో 22 లక్షలు పెరిగింది. ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం, మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31 నాటికి రూ 1.5 లక్షలు, చేతిలో నగదు రూ 36,000 ఉంది. ఇక ఎస్‌బీఐ గాంధీనగర్ బ్రాంచ్‌లో గత ఏడాది రూ 1.6 కోట్లుగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ 1.86 కోట్లకు పెరగడంతో మోదీ సంపద ఎగబాకింది. ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం.. మోదీ పేరిట ఎలాంటి వ్యక్తిగత వాహనం లేదు. ఎలాంటి ఆర్థిక సంస్థల నుంచి కూడా ఆయన రుణం తీసుకోలేదు. స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల నుంచి ఎలాంటి సంపద లేదు. అయితే నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌లో రూ.8,93,251, , లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ పాలసీ రూ.1,50,957, 2002లో కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్స్‌లో రూ. 20 వేల చొప్పున ఇన్వెస్ట్ చేశారు.. మోదీకి రూ 1.48 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. గుజరాత్ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రెండు నెలల ముందు ప్రధాని మోదీ గాంధీనగర్‌ సెక్టార్‌ 1లో ముగ్గురు సహ యజమానులతో కలిసి 3531 చ.అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. దీనిని 2002 అక్టోబర్‌ 225న కొనుగోలు చేయగా.. అప్పట్లో దీని ఖరీదు రూ. 1.3 లక్షలుగా ఉంది. భూమిపై రూ. 2.4 లక్షల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దీని విలువ..రూ. 1.10 కోట్లు పలుకుతోంది. అయితే 2014 ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏ కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేయలేదు. 

Friday, September 24, 2021

పాక్ పాత్రపై మోదీతో కమలాహారిస్‌ చర్చ

  

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఉగ్రవాదంలో పాకిస్తాన్  పాత్ర గురించి చర్చించారు. వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ లో పలు ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని, ఈ విషయంలో ఇస్లామాబాద్ పై చర్యలు తీసుకోవాలని కమలాహారిస్ కోరారు. ఉగ్రవాదుల ప్రభావం అమెరికా, భారతదేశాలపై పడకుండా చర్యలు తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కోరారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని, ఉగ్రవాద గ్రూపులకు పాక్ మద్ధతును నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కమలాహారిస్ ప్రధానమంత్రి మోదీతో వ్యాఖ్యానించారు. అమెరికా, భారతదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం రెండు దేశాల బాధ్యత అని కమలాహారిస్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, అఫ్ఘానిస్థాన్, ఇండో-పసిఫిక్ వంటి ముప్పులతో సహా ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించారు.కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో భారతదేశానికి మద్ధతు అందించిన కమలాహారిస్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.భారతదేశాన్ని సందర్శించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. 

Popular Posts