Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label netflex. Show all posts
Showing posts with label netflex. Show all posts

Monday, September 18, 2023

జియో రీచార్జ్‌ చేసుకుంటే ఉచిత ఓటీటీ సేవలు !


ఓటీటీ లవర్స్‌ని ఆకర్షించేందుకు జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీ సబ్‌స్క్రైబర్స్‌ భారీగా పెరుగుతున్నారు. కరోనా తర్వాత ఓటీటీల్లోనే లు చూసే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. దీంతో ఓటీటీ మార్కెట్‌ రోజురోజుకీ విస్తరిస్తోంది. సరిగ్గా టెలికాం కంపెనీలు దీనిని క్యాష్‌ చేసుకుంటున్నాయి. రీచార్జ్‌ ప్లాన్స్‌లో ఓటీటీ సేవలను కలిపి అందిస్తున్నాయి. తాజాగా రిలయన్స్‌ జియో.. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి రెండు రీచార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ను యూజర్లు ఉచితంగా వీక్షించే అవకాశం పొందొచ్చు. జియో అందిస్తోన్న తొలి రీఛార్జ్‌ ప్లాన్‌ రూ. 1099. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు రోజుకు 2జీబీ బడేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకున్న యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ వెర్షన్‌ను ఉచితంగా పొందొచ్చు. ఇక వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతానికి అన్‌లిమిటెడ్‌ మొబైల్ డేటాను పొందొచ్చు. వీటితో పాటు అదనంగా రోజుకు 100 ఉచిత మెసేజ్‌లు, జియో యాప్స్‌ను యాక్సెస్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇక జియో అందిస్తోన్న రెండో ప్లాన్‌రూ. 1499. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకునే రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం 5జీ డేటా అందిస్తారు. నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ వెర్షన్‌ను ఉచితంగా పొందొచ్చు. ఇక 84 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు జియో యాప్స్‌ యాక్సెస్‌ పొందొచ్చు.

Friday, April 28, 2023

ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ !


ఓటీటీ సంస్థలు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించడానికి మిలియన్ల కొద్దీ పెట్టుబడి పెడుతున్నాయి. ఈ మూడు ఓటీటీ దిగ్గజాలు ఒకే విధమైన కంటెంట్‌ను అందిస్తున్నట్లు అనిపించినప్పటికీ అవి వేర్వేరు ధరలు, ప్రయోజనాలతో కూడిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమకు ఏ ప్లాన్ ఉత్తమమో? నిర్ణయించుకోవడం కష్టతరంగా మారింది. నెట్ ఫ్లిక్స్ రూ.149 నుంచి రూ.649 వరకూ నెలవారీ వివిధ సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది. రూ.149 ప్లాన్‌ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్‌ను కేవలం ఒక్క స్క్రీన్‌లోనే చూసే అవకాశం ఉంటుంది. దీని వ్యాలిడిటీ నెలరోజులు. అయితే వార్షిక ప్లాన్ ధర మాత్రం రూ.1788గా ఉంది. అయితే రూ.199 ప్లాన్‌లో టీవీలో కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉంది. కానీ ఒకేసారి టీవీ, ఫోన్‌లో వీక్షించే అవకాశం ఉండదని గమనించాలి. ఈ ప్లాన్ వార్షిక వ్యాలిడిటీతో కావాలనుకుంటే మాత్రం రూ.2388 చెల్లించాల్సి ఉంటుంది. రూ.499ను స్టాండర్డ్ ప్లాన్ అని కంపెనీ ప్రకటించింది. ఒకేసారి ఫోన్, టీవీల్లో కంటెంట్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లాన్ వార్షిక ధర రూ.5988గా ఉంది. అలాగే రూ.649 ప్లాన్‌లో ఒకేసారి ఆరు డివైజ్‌లో కంటెంట్‌ను వీక్షించవచ్చు. అయితే ఈ ప్లాన్ వార్షిక ధర రూ.7788గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్ కంపెనీ వినియోగదారులను ఆకట్టుకోవడానికి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది. అలాగే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుంటే అమెజాన్‌లో ఆర్డర్లకు సంబంధించి ప్రత్యేక రాయితీలను కూడా పొందవచ్చు. వీటి ధరలు రూ.299 నుంచి రూ.1499గా ఉంది. రూ.299తో నెల రోజుల సబ్‌స్క్రిప్షన్‌తో ప్రైమ్ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. రూ.599ను మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌తో పొందవచ్చు. అయితే ఈ ధరలో కేవలం మొబైల్‌లో మాత్రమే కంటెంట్ వీక్షించేలా మరో ప్లాన్ అమెజాన్ అందిస్తుంది. కాబట్టి సబ్‌స్క్రైబ్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.1499ను చెల్లించాలి. అయితే అమెజాన్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.999గా కంపెనీ నిర్ణయించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ సదుపాయం కూడా ఉంది. ఉచిత యాక్సెస్‌లో వినియోగదారులు ఎంపిక చేసిన లు, టీవీ షోలను యాడ్స్‌తో చూడాల్సి ఉంటుంది. అలాగే ఓ ఐదు నిమిషాల పాటు లైవ్ క్రికెట్ స్ట్రీమింగ్‌ను ఆశ్వాదించవచ్చు. అయితే హాట్ స్టార్‌ను రూ.299తో సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్ మొత్తం యాడ్స్ లేకుండా వీక్షించవచ్చు. గరిష్టంగా నాలుగు పరికరాల్లో కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. రూ.899 ప్లాన్‌తో సంవత్సరం పాటు కంటెంట్ ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఇది కేవలం క్రికెట్ అభిమానులను ఉద్దేశించిన ప్లాన్. అయితే అన్‌లిమిటెడ్ కంటెంట్‌ను సంవత్సరం పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా వీక్షించాలంటే రూ.1499గా చెల్లించాల్సి ఉంటుంది. 

Thursday, April 20, 2023

తగ్గిన సబ్‌స్క్రిప్షన్ చార్జీలు


నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ చార్జీలను తగ్గించింది. భారత్‌తో పాటు మరో 115 దేశాలలో సబ్‌స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ 2021లో భారతదేశంలో తక్కువ-ధర సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇక్కడ కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌లో 30 శాతం పెరుగుదలను, వార్షిక ఆదాయంలో 24 శాతం పెరుగుదలను నమోదు చేసింది. భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన నెట్‌ఫ్లిక్స్‌ మొదటిసారిగా సబ్‌స్క్రిప్షన్ చార్జీలను 20 నుంచి 60 శాతం తగ్గించింది. గతంలో నెలకు రూ.199 ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్-ఓన్లీ ప్లాన్ ఇప్పుడు రూ.149లకు తగ్గింది. అలాగే టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్‌ ఇలా ఎందులో అయినా యాక్సెస్ చేసుకోగలిగే బేస్‌ సబ్‌స్క్రిప్షన్ చార్జ్‌ గతంలో రూ.499 ఉండగా ప్రస్తుతం రూ.199 మాత్రమే. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ చార్జీలు తగ్గాయి. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా కుటుంబాలు వినోదాలకు చేసే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ప్రత్యర్థి కంపెనీ నుంచి గట్టి పోటీని నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చార్జీలు తగ్గించిన దేశాల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిన ఆదాయం కేవలం 5 శాతం మాత్రమే.

Saturday, November 5, 2022

నెట్‌ఫ్లిక్స్ 'బేసిక్ విత్ యాడ్స్' ప్లాన్ లాంచ్


నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్ విత్ యాడ్స్  అనే కొత్త యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌ను 12 దేశాల్లో ప్రారంభించింది. పేరు సూచించినట్లుగా ఈ ప్లాన్ తీసుకున్న సబ్‌స్క్రైబర్స్‌ వీడియోస్ చూస్తున్నప్పుడు యాడ్స్ చూడాల్సి వస్తుంది. కాకపోతే ప్రీమియం, స్టాండర్డ్, బేసిక్ ప్లాన్స్‌తో పోలిస్తే దీనికి తక్కువ అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది. ఇండియాలో ఈ కొత్త ప్లాన్‌ను ఎప్పుడు తీసుకొస్తామనే దానిపై కంపెనీ ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా ఈ చౌకైన ప్లాన్ ఈ ఏడాది చివరిలోగా ఇండియాలో కూడా అందుబాటులోకి రావచ్చు. యాడ్ సపోర్టెడ్ ప్లాన్ యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, బ్రెజిల్‌లోని సబ్‌స్క్రైబర్‌ల కోసం తాజాగా రిలీజ్ అయింది. కొత్త బేసిక్ విత్ యాడ్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర అమెరికాలో నెలకు 6.99 డాలర్లు అంటే దాదాపు రూ.578 వరకు ఉంటుంది. అక్కడ బేసిక్ ప్లాన్ ధర 9.99 డాలర్లుగా ఉంది. అంటే కొత్త యాడ్ సపోర్టెడ్ ప్లాన్ మూడు డాలర్ల తక్కువ ధరతో వస్తోంది. ఈ ప్లాన్‌ కింద కంపేటబుల్ ఫోన్/ట్యాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీ డివైజ్‌లో 720P HD క్వాలిటీలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ చూడవచ్చు. అంతేకాకుండా, ఎలాంటి యాడ్స్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ గేమ్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు. కొత్త బేసిక్ ప్లాన్ వల్ల ఇప్పటికే ఉన్న బేసిక్ ప్యాక్‌తో కంటెంట్ వీక్షిస్తున్న యూజర్లు, ప్రస్తుత రన్నింగ్ ప్లాన్‌లు ప్రభావితం కాబోవని ప్లాట్‌ఫామ్ క్లారిటీ ఇచ్చింది. పాత బేసిక్ ప్లాన్ యాడ్-ఫ్రీగానే ఉంటుందని.. మొత్తం కంటెంట్‌ను యాడ్ ఫ్రీగా ఆస్వాదించవచ్చని పేర్కొంది. ఓల్డ్ బేసిక్ ప్లాన్, న్యూ బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్‌ ఒకే విధమైన ఫీచర్లతో వస్తాయని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అయితే కొత్త యాడ్ సపోర్టివ్ ప్లాన్‌లో యూజర్లు గంటకు 4 నుంచి 5 నిమిషాల వరకు యాడ్స్ చూస్తారు. ఏదైనా షో లేదా సినిమా ప్రారంభించే ముందు 30 సెకన్ల వరకు నిడివి గల యాడ్స్ పొందుతారని ప్లాట్‌ఫామ్ పేర్కొంది. ఒక యాడ్ లెంగ్త్ 15 నుంచి 30 సెకన్ల వరకు ఉండొచ్చు. కొత్త యాడ్ సపోర్టెడ్ ప్లాన్ మూవీలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి యూజర్లను అనుమతించదు. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం, ఈ ప్లాన్ కింద యూజర్లకు లైసెన్స్ పరిమితుల కారణంగా కొన్ని మూవీస్/టీవీ షోలు అందుబాటులో ఉండవు. మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఈ మూవీలు/ టీవీ షోల టైటిల్స్‌పై లాక్ ఐకాన్ ఉంటుంది. యాక్సెస్ చేయలేని కంటెంట్ 5-10% వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. యూఎస్‌తో పోల్చితే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్స్‌ ధరలు చాలా తక్కువ. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో రూ.149కే బేసిక్ మొబైల్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఒకవేళ బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్ ధర కూడా ఇంతకంటే తక్కువగా ఉంటే ఇండియాలో సబ్‌స్క్రైబర్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్ రెవిన్యూ కూడా పెరుగుతుంది.

Thursday, May 19, 2022

ఓటీటీలో రిలీజ్ కానున్న కొత్త చిత్రాలు

 


మే 20 న ఓటీటీలో మూడు కొత్త సినిమాలు స్ట్రీమ్ కానున్నాయి. 2022 భారీ బడ్జెట్ మరియు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్  తో పాటుగా ఆచార్య మరియు భళా తందనానా సినిమాలు కూడా ఉన్నాయి. 

ఆర్ఆర్ఆర్ : దర్శక ధీరుడు S S రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు Jr.NTR అద్భుతమైన నటనతో వచ్చిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టడమే కాకుండా ప్రజల గుండెలో నిలిచిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1,000 కోట్లకు పైగా కలక్షన్స్ సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. RRR మూవీ మే 20 న Zee 5 మరియు Netflix రెండు ప్లాట్ ఫామ్స్ నుండి స్ట్రీమ్ కాబోతోంది. ఈ సినిమా OTT లో ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా ఆనందాన్నిచ్చే వార్తే అవుతుంది.

ఆచార్య : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' మే 20 న అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అవుతోంది. ఇటీవలే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, సినిమాలో మెగాస్టార్ మరియు రామ్ చరణ్ ల అద్భుతమైన నటన మరియు డాన్స్ రెండు ఆకట్టుకునే అంశాలు. అంతేకాదు, 'భలే బంజారా' ఫుల్ వీడియో సాంగ్ ను కూడా విడుదల చేశారు.

భళా తందనానా : శ్రీవిష్ణు మరియు కేథరీన్ జంటగా నటించిన క్రైం థ్రిల్లర్ 'భళా తందనానా' కూడా ఇదే వారం మే 20న Disney+ HotStar నుండి స్ట్రీమ్ కాబోతోంది. ఎప్పుడు ఏదోఒక విలక్షణమైన కథ మరియు పాత్రలను మాత్రమే చేసే శ్రీవిష్ణు మరొకసారి మంచి సినిమాతో ముందుకు వచ్చాడు. మార్చ్ 6 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించేలేక పోయింది. కానీ, శ్రీవిష్ణు యాక్టింగ్, పోసాని మరియు సత్య ల కామెడీ కేథరీన్ గ్లామర్ వంటి ఆకట్టుకునే అంశాలు వున్నాయి. 

Wednesday, May 18, 2022

కాస్ట్ కటింగ్ పేరిట 150 మంది ఉద్యోగుల తొలగింపు !


నెట్‌ఫ్లిక్స్ 150 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. రెవెన్యూ బాగా తగ్గడంతో, కాస్ట్ కటింగ్ కోసమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్సనల్ పర్‌ఫార్మెన్స్ ను బట్టి ఇలా చేయలేదని ఆర్థిక లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని విధుల్లో నుంచి తొలగించామని నెట్‌ఫ్లిక్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. సహోద్యుగులను ఇంటికి పంపించడం ఏ మాత్రం ఇష్టం లేదని అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ 2 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దశాబ్ద కాలంలో ఇదే పెద్ద దెబ్బని కంపెనీ వెల్లడించింది. ఈ  సంఖ్య మరో మూడు నెలల్లో 20 లక్షల వరకూ చేరుకోవచ్చని ఆందోళన చెందుతున్నారు. గత నెలలోనూ తమ ఎంటర్‌టైన్మెంట్ కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను, రైటర్స్ ను తొలగించింది. 

Saturday, April 30, 2022

నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు


డీటీహెచ్ తో పాటు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా ఎయిర్‌టెల్ తన సేవలను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ సర్వీస్  లతో వివిధ రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వినియోగదారులకు ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలతో పాటుగా వృత్తిపరమైన ప్రయోజనాలను కూడా కలుపుకొని అందిస్తాయి. ఇతర ISPల మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా తమ ప్లాన్‌లతో వివిధ రకాల OTT సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు తన అభివృద్ధిలో భాగంగా యూజర్లను ఆకట్టుకోవడానికి తన ప్లాట్‌ఫారమ్‌లోని రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను బండిల్ చేయబడి అందిస్తున్నది.  ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌తో 300 Mbps వేగంతో 'ప్రొఫెషనల్' ప్లాన్‌ను అందిస్తున్నది. దీనిని వినియోగదారులు నెలకు రూ.1,498 ధర వద్ద పొందవచ్చు. ఇది 300 Mbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ అపరిమిత ప్లాన్ లో FUP డేటా 3500GB లేదా 3.5TB కి పరిమితం చేయబడి ఉంటుంది అని గమనించండి. ఈ ప్లాన్ యొక్క OTT ప్రయోజనాలలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్ మరియు షా అకాడమీ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. ఇది తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో 'ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్' ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 1Gbps వేగంతో 'ఇన్ఫినిటీ ప్లాన్' పేరుతో మరొక అపరిమిత డేటా ప్లాన్‌ను అందిస్తుంది. 'ఇన్ఫినిటీ' ప్లాన్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌ని కలిగి ఉండాలి. ఈ ప్లాన్ నెలకు రూ.3,999 ధరతో 1Gbps హై-స్పీడ్ తో అపరిమిత డేటాను అందిస్తుంది. అన్ని అపరిమిత ప్లాన్‌ల వలె ఇది కూడా 3500GB లేదా 3.5TB FUP డేటాకు పరిమితం చేయబడి ఉంది. ఈ ప్లాన్ తో యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి కొన్ని ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచితంగా అందిస్తుంది. వీటితో పాటుగా కంపెనీ ఇప్పుడు కొత్తగా ఈ ప్లాన్ కు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ని కూడా జోడించబడింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌లోని ప్రొఫెషనల్ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ యాక్సెస్ ఉంటుంది. అయితే ఇన్ఫినిటీ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం యాక్సెస్ ఉంటుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను విడిగా కొనుగోలు చేయాలని అనుకుంటే కనుక స్టాండర్డ్ ప్లాన్ ను రూ.199 ధర వద్ద పొందవచ్చు. ఇది ఒక పరికరంలో 480p రిజల్యూషన్‌లో వీడియో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. అలాగే ప్రీమియం ప్లాన్ గరిష్టంగా నాలుగు పరికరాల్లో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. 

Monday, March 7, 2022

నెట్‌ఫ్లిక్స్‌, టిక్‌టాక్‌ రష్యా లో సర్వీసులు బంద్!


ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ప్రపంచానికి వ్యతిరేకంగా రష్యా అవలంభిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఎంతగా వారించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలను విధించాయి. అన్నివైపులా రష్యాను కట్టడి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాయి. అయినా సరే.. నేను మోనార్క్ అంటూ పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగలేదు. రష్యా ప్రవేశపెట్టిన ఫేక్ చట్టాన్ని ఆన్ లైన్ స్ట్రీమింగ్, సోషల్ ప్లాట్ ఫాంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ దిగ్గజం టిక్ టాక్, ప్రపంచ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ రష్యాకు గట్టి షాక్ ఇచ్చాయి. రష్యాలో తమ సర్వీసులను పూర్తిగా బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆంక్షల్లో భాగంగా రష్యాతో రిలేషన్ బ్రేక్ చేస్తున్నాం. రష్యా తెచ్చిన ఫేక్‌ చట్టాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం' అంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేశాయి. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌కు రష్యాలో మిలియన్‌కు పైగా యూజర్లు ఉన్నారు. రష్యాలో నెట్ ఫ్లిక్స్ కొత్త యూజర్లకు అనుమతులు ఉండవని స్పష్టం చేసింది. ఇప్పటికే రష్యాలో నెట్ ఫ్లిక్స్ వినియోగిస్తున్న యూజర్ల మాటేంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరో సోషల్ దిగ్గజం టిక్ టాక్ కూడా రష్యాలో తమ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసులు సహా ఇతర సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించింది. యుక్రెయిన్‌ ఆక్రమణకు సంబంధించి రష్యాపై ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్ చట్టం, కఠిన శిక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. రష్యా తెచ్చిన ఈ ఫేక్ చట్టానికి వ్యతిరేకంగా టిక్ టాక్, నెట్ ఫ్లిక్స్ తమ సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టుగా వెల్లడించాయి. మరోవైపు యూఎస్ క్రెడిట్ కార్డు కంపెనీలైన Visa, Mastercard, American Express కూడా రష్యాలో తమ సర్వీసులను నిలిపివేస్తామని వెల్లడించాయి. సౌత్ కొరియా దిగ్గజమైన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ షిప్స్ ఉత్పత్తులను రష్యాకు తరలించడం నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తమ సర్వీసులను ఇతర అతిపెద్ద టెక్ దిగ్గజాలైన ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, డెల్ కంపెనీలకు తమ సర్వీసులను అందించనున్నట్టు స్పష్టం చేశాయి. అలాగే ఆపిల్, గూగుల్ కంపెనీలు రష్యాలోని తమ యాప్ స్టోర్లలో సర్వీసులను నిలిపివేసినట్టు వెల్లడించాయి. ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా తమ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నామని వెల్లడించింది.

Popular Posts