Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label paytm. Show all posts
Showing posts with label paytm. Show all posts

Wednesday, May 10, 2023

పేటీఎమ్ లో సరికొత్త ఫీచర్లు !


ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం తాజాగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.  యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన iOSలో యూపీఐ లైట్ ఫీచర్, యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్ యాడింగ్, స్ల్పిట్, మొబైల్ నంబర్స్ కు బదులుగా పేటీఎం యాప్‌లో ప్రత్యామ్నాయ యూపీఐ ఐడీ లాంటి ఫీచర్లను తీసుకొచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్‌ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ, బోర్డు సభ్యుడు భవేష్ గుప్తా, PPBL సీఈవో సురిందర్ చావ్లాలు కంపెనీ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను ప్రకటించారు. కొత్త ఫీచర్ తో యూజర్లు రూపే క్రెడిట్ కార్డ్‌ను పేటీఎం యాప్‌లో యూపీఐ ఐడీతో లింక్ చేసుకునే వీలు ఉంది. తాజాగా పరిచయం చేసిన ఫీచర్స్ లో ముఖ్యమైనది.. స్ప్లిట్ బిల్. అంటే ఏదైనా బిల్లును ఫ్రెండ్స్ గ్రూప్ లో విభజించి పంచుకోవచ్చు. అలాగే పేటీఎంలో చేసిన అన్ని చెల్లింపులను ట్యాగ్ చేసుకోవచ్చు. అదే విధంగా ట్యాగ్‌ చేసిన చెల్లింపులను ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన యూపీఐ లైట్ ఫీచర్ తాజాగా యాపిల్ ఐఓఎస్ లో కూడా అందుబాటులోకి తెచ్చారు. చెల్లింపులను క్రమ బద్ధీకరించడం, చెల్లింపులు ఫెయిల్యూర్ సమస్యను తొలగించడం లాంటివి ఈ ఫీచర్ ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా ప్రస్తుతం పిన్‌తో సంబంధం లేకుండా రూ. 200 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. యూపీఐ లైట్‌కి రోజుకు రెండుసార్లు రూ. 2,000 యాడ్ చేసుకోవచ్చు.

Friday, August 5, 2022

పేటీఎం యాప్‌లో నెట్వర్క్ ఎర్రర్ !


పేటీఎం పేమెంట్ సర్వీసులు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా స్తంభించిపోయాయి. స్మార్ట్ ఫోన్లలో యాప్ సేవలు మాత్రమే కాకుండా పేటీఎం అధికారిక వెబ్‌సైట్ కూడా డౌన్ అయింది. అప్పటి వరకూ పేమెంట్ ద్వారా పేమెంట్లు చేసిన యూజర్ల డబ్బులు తమ అకౌంట్లో క్రెడిట్ కాలేదు. దాంతో తమ డబ్బులు ఏమయ్యాయో తెలియక యూజర్లలో గందరగోళం నెలకొంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసులు పనిచేయడం లేదని, బాధిత యూజర్లు పేటీఎం యాప్, వెబ్‌సైట్‌కి లాగిన్ కాలేకపోతున్నామని, పేమెంట్స్ చేయలేకపోయామని ట్విట్టర్ వేదికగా తమ సమస్యను తెలిపారు. కొంతమంది పేటీఎం యూజర్లు పేమెంట్స్ చేయడానికి ప్రయత్నించగా.. ఆటోమాటిక్‌గా Account Logout అయిపోతుందని, తిరిగి లాగిన్ చేయలేకోపోతున్నామని Paytm అధికారిక ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. అయితే యూజర్ల ఫిర్యాదుతో స్పందించిన Paytm ఇప్పుడు సమస్యను పరిష్కరించింది. పేటీఎం యూజర్లు ఎప్పటిలానే తమ లాగిన్ డేటాను ఉపయోగించి సులభంగా లాగిన్ చేయవచ్చు. Paytm సంస్థ తమ ప్లాట్ ఫాంపై లావాదేవీలు తగ్గిపోయాయని ధృవీకరించింది. పేమెంట్లు చేసేందుకు ప్రయత్నించిన యూజర్లను నేరుగా లాగిన్ స్క్రీన్‌కి రీడైరెక్ట్ అవుతుందని తెలిపింది. అయితే మళ్లీ యూజర్లు తమ లాగిన్ వివరాలను ఎంటర్ చేసినా తీసుకోవడం లేదు. ప్రతి పేటీఎం యూజర్‌కు 'Something went wrong, please try again after some time' error అనే ఎర్రర్ మెసేజ్ డిస్ ప్లే అవుతోంది. దాంతో పీటీఎం యూజర్లు ఈ ఎర్రర్ స్ర్కీన్ షాట్ తీసి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పేటీఎం యూజర్లు Paytmతో సమస్యలను ఎదుర్కొంటున్నారని అవుట్‌టేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్ DownDetector కూడా ధృవీకరించింది. దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని పేటీఎం యూజర్లు ఎక్కువగా ఈ ఔటేజ్ సమస్యలను ఎదుర్కొన్నారు. Paytm అధికారికంగా ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. పేటీఎం యాప్‌లో 'Network Error ' ఉందని ధృవీకరించింది. ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించడానికి తమ బృందం పని చేస్తోందని పేర్కొంది. Paytm యాప్‌కి సంబంధించిన నెట్‌వర్క్ లోపం ఇప్పుడు పరిష్కరించినట్టు వెల్లడించింది. పేటీఎం వినియోగదారులు తమ సర్వీసుల్లో లాగిన్ చేసి ఎప్పటిలానే లావాదేవీలు చేయవచ్చు లేదా Paytm ఇతర ఫీచర్‌లను ఉపయోగించవచ్చునని పేర్కొంది.

Friday, March 11, 2022

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు?


ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పై భారత రిజర్వ్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొన్ని మెటీరియల్ సూపర్ వైజరీ సమస్యల కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ సంస్థకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దంటూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం ఐటీ సిస్టమ్స్ పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ పూర్తి చేసేంతవరకు ఐటీ అడిట్ సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. పేటీఎం బ్యాంకులో సూపర్ వైజరీ సమస్యలు ఉన్నాయని ఆర్బీఐ దృష్టికి వచ్చింది. పేటీఎం  పేమెంట్స్ బ్యాంకులో శర్మ సొంతంగా 51శాతం వాటాను కలిగి ఉన్నారు. అందుకే దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించేందుకు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటలో వెల్లడించింది. ఈ క్రమంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఐటీ సిస్టమ్‌పై సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించేందుకు ఐటీ ఆడిట్ సంస్థను నియమించాల్సిందిగా ఆదేశించినట్లు ఆర్బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం అనేది IT ఆడిటర్ల నివేదికను సమీక్షించిన తర్వాతే జరగాల్సి ఉంది. అది కూడా RBI మంజూరు చేసే నిర్దిష్ట అనుమతికి లోబడి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

Wednesday, February 9, 2022

యూపీఐ లావాదేవీలపై రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్.!


ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేమెంట్ సంస్థ పేటీఎం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యూజర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది.. పేటీఎం యూజర్లు చేసే యూపీఐ  లావాదేవీలపై రూ.100 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 20వరకు Paytm India వర్సెస్ West Indies ODI, T20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లు జరిగే సమయంలో Paytm ద్వారా యూజర్లు UPI మనీ ట్రాన్సాక్షన్లు చేస్తే.. వారికి క్యాష్‌బ్యాక్, ఇతర రివార్డ్‌లను అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మ్యాచ్ జరిగే రోజులలో పేటీఎం కొత్త యూజర్లు '4 ka 100 cashback offer’ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. Paytm UPI ద్వారా నగదు బదిలీ చేసిన యూజర్లకు రూ. 100 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. పేటీఎం కొత్త యూజర్లు రూ. 4 నుంచి అన్ని నగదు బదిలీలపై ఈ ఆఫర్‌కు వర్తిస్తుంది. రిఫరల్ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావడం ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. UPI నగదు బదిలీలకు Paytm యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేయొచ్చు. ఇలా ప్రతిసారి యూజర్ రెఫరర్, రిఫరీ ఇద్దరూ గరిష్టంగా రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ప్రమోట్ చేసేందుకు పేటీఎం కంపెనీ భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, హర్భజన్ సింగ్, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్‌లతో ఆన్‌లైన్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది. పేటీఎం యూజర్లు పేటీఎం యాప్‌ ద్వారా కొన్ని నిమిషాల్లోనే Paytm UPI లో రిజిస్టర్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మీ బ్యాంకు అకౌంటుకు లింక్ అయిన అకౌంట్ బ్యాలెన్స్‌ను ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా UPI QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పేమెంట్స్ చేసుకోనేందుకు అనుమతిస్తుంది. 

Friday, November 12, 2021

పేటీఎం ఐపీవో ఒక్కో షేర్ ధర రూ. 2,150


డిజిటల్ చెల్లింపుల ఆర్థిక సేవల సంస్థ పేటీఎంతమ ఐపీఓలో షేరు కేటాయింపు ధరను నిర్ణయించింది. ప్రారంభ షేర్ సేల్ ఒక్కొక్కటి రూ. 2,150 ఆఫర్ ధరను నిర్ణయించింది. పేటీఎం శుక్రవారం (నవంబర్ 12)న కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫైనల్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం.. నవంబర్ 18న ఈ కంపెనీ మార్కెట్లో లిస్టు కానుంది. బ్యాంకింగ్, షాపింగ్, మూవీ ట్రావెల్ టికెటింగ్ నుంచి గేమింగ్ వరకు అనేక రకాల సేవలను పేటీఎంఅందిస్తోంది. ఐపిఓ  బిడ్డింగ్ స్వీకరణ సమయంలో తన షేర్ల ధరను ఒక్కో షేరుకు రూ. 2,080 నుంచి 2,150 ధరగా నిర్ణయించింది. షేర్ అత్యధిక ధర ఆధారంగా ప్రైస్ బ్యాండ్ ఎగువన కంపెనీ విలువ రూ. 1.39 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఐపీఓకు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్స్ వచ్చాయి. కంపెనీ యాంకర్-అలాట్‌మెంట్ 10 రెట్ల కంటే ఎక్కువ ఉన్నందున పేటీఎం ఈ డీల్‌ను టాప్-ఎండ్‌లో అంచనా వేస్తోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రూ. 18,300 కోట్ల షేర్ విక్రయించనుంది. అధికారికంగా ఒన్ 97 కమ్యూనికేషన్స్ అని పిలిచే కంపెనీ, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద ఫిన్‌టెక్ ఐపీవోగా పేటీఎం అవతరించింది. మొత్తంమీద, పేటీఎం ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఫిన్‌టెక్ స్టాక్ అరంగేట్రం అవుతుంది. కంపెనీ పత్రం దాని ఐ పి  ఓ కోసం లీగల్ పార్టనర్‌లు, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లు  ఇతర సలహాదారులకు చెల్లించే రుసుము ప్రివ్యూను షేర్ చేస్తుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం.. పేటీఎం బిఆర్ ఎల్ ఎం లకు రూ. 323.9 కోట్లు చెల్లిస్తుంది. మొత్తంగా రూ. 18,300 కోట్లలో 1.8 శాతానికి సమానంగా ఉంటుంది. ఇండియాలో ఇప్పటివరకు అతిపెద్ద సంచిత బిఆర్ ఎల్ ఎం చెల్లింపులలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. పేటీఎం ఐపీవో కోసం బిఆర్ ఎల్ ఎం లుగా మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐ సి ఐ సి  సెక్యూరిటీస్, జేపి  మోర్గాన్, సిటీ హెచ్ డి ఏప్  బ్యాంక్‌లను నియమించింది. శార్దూల్ అమర్‌చంద్, లాథమ్ & వాట్కిన్స్, ఖైతాన్ & కో, షీర్‌మాన్ & స్టెర్లింగ్‌లతో సహా భారత్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్‌లలోని న్యాయ సలహాదారులు కూడా ఐపీవో లో వివిధ పోస్టుల్లో పనిచేశారు. పేటీఎం ఐపీవో 1.89 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో ముగిసింది. అందుబాటులో ఉన్న 4,83,89,422 షేర్లకు మొత్తం 9,14,09,844 పేటీఎం షేర్లు వేలం వేసింది. పేటీఎం  రూ. 10,065 కోట్లతో పోలిస్తే.. రూ. 19,653 కోట్ల విలువైన మొత్తం బిడ్‌లను దక్కించుకుంది. ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం.. పేటీఎంలో 28 శాతం హోల్డింగ్ కలిగిన యాంట్ గ్రూప్ 47.04 బిలియన్ల విలువైన షేర్లను 23 శాతం వాటాతో విక్రయిస్తోంది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 16.89 బిలియన్ రూపాయల వాటా విక్రయంతో 2.5 శాతం పాయింట్లు తగ్గి 16 శాతానికి చేరుకుంది.

Friday, August 20, 2021

కరెంట్ బిల్ కడితే పేటీఎం క్యాష్‌బ్యాక్పేటీఎం. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌తో యూజర్లను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది పేటీఎం. ఇటీవల గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా మూడు నెలలు రూ.2,700 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పైనా పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం ద్వారా మొదటిసారి కరెంట్ బిల్ చెల్లిస్తే రూ.50 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇప్పటికే కరెంట్ బిల్స్ చెల్లిస్తున్నవారికి రివార్డ్స్ కూడా లభిస్తాయి. అన్ని రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డుల బిల్ పేమెంట్స్‌కు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-APSPDCL, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-APEPDCL, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-APCPDCL బోర్డుల కరెంట్ బిల్స్ పేటీఎంలో చెల్లించొచ్చు. ఇక తెలంగాణలోని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్-TSNPDCL, కోఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సప్లస్ సొసేటీ లిమిటెడ్ సిరిసిల్ల బోర్డుల కరెంట్ బిల్స్ పేటీఎంలో చెల్లించొచ్చు.

Popular Posts