Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, September 17, 2023

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీపై తగ్గింపు ధర !

 


న్‌ప్లస్‌ మొబైల్ కంపెనీ జులైలో ‘నార్డ్‌ 3 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇది శక్తివంతమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. అద్భుతమైన కెమెరా, పెద్ద డిస్‌ప్లే, సూపర్ బ్యాటరీతో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. నార్డ్‌ 3 5జీ అమ్మకాలు భారీగా ఉన్నాయి. ఆరంభంలో అయితే ‘నో స్టాక్’ బోర్డు ఉండేది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. దాంతో నార్డ్‌ 3 5జీని పది వేల లోపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 33999. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ధర ఉంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 24900 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ వర్తిస్తే ఈ ఫోన్ మీకు రూ. 9,099కి సొంతం అవుతుంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుండా లేటెస్ట్ వెర్షన్ అయితేనే ఈ పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ లభిస్తుంది. లేదంటే తక్కువ ఎక్స్‌ఛేంజ్‌ వస్తుంది.  నార్డ్‌ 3 5జీ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. అమెజాన్‌, అధికారిక వన్‌ప్లస్‌ స్టోర్‌ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేసినవారికి మాత్రమే నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ను ఉచితంగా ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ బడ్స్‌ కంపెనీ అందిస్తున్న ఎంట్రీ- లెవెల్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌. ఛార్జింగ్‌ కేస్‌తో కలిపి ఈ బడ్స్‌ బ్యాటరీ లైఫ్‌ 40 గంటలు. ఈ బడ్స్‌ 2ఆర్‌ ధర భారత్‌లో రూ.2,199. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ ఫోన్‌ రెండు వేరియంట్లలో భారత్‌లో అందుబాటులో ఉంది. 8GB + 128GB ధర రూ.33,999 కాగా.. 16GB + 256GB ధర 37,999గా ఉంది. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9,000 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌13తో వస్తోంది. 120Hz రీఫ్రెస్‌ రేట్‌ ఉన్న 6.74 అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉంటాయి. 80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

21న మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఆవిష్కరణ


లెనోవోకు చెందిన మోటోరోలా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లలో అందించే బ్రాండ్లలో కూడా ఒకటి. ఇప్పటికే అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వాస్తవానికి ఈ మోడల్ ను ఏప్రిల్ లోనే పరిచయం చేశారు. మోటోరోల్ ఎడ్జ్ 40, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో మోడళ్లను ఇంతకు ముందే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే వాటితో పాటు ప్రకటించిన ఈ మోటోరోలా ఎడ్జ్ 40 నియోను మాత్రం మన దేశంలో విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ను సెప్టెంబర్ 21న ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.  మోటోరోలా అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఎక్స్(ట్విట్టర్)లో మోటోరోలా ఇండియా ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 21న ఇండియన్ మార్కెట్లోకి ఫోన్ రానుందని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ సూచన ప్రాయక చిత్రాన్ని కూడా విడుదల చేసింది. అది బ్లూ కలర్ లో రెండు కెమెరాలు కలిగి, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ను కలిగి ఉంటుంది.  మై స్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ లో 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (2400 × 1080 పిక్సెల్‌లు) పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది,144హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది మాలి జీ77 జీపీయూ, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1050 ఎస్ఓసీ ద్వారా శక్తి పొందుతుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత మైయూఎక్స్ ఓఎస్ తో పనిచేస్తుంది. ఎడ్జ్ 40 నియో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముందు కెమెరా 32-మెగాపిక్సెల్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 68వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. భద్రత కోసం, హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‌తో వస్తుందని కూడా చెబుతున్నారు. డ్యుయల్ నానో సిమ్-సపోర్ట్ చేసే ఫోన్ 5జీ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, వైఫై, యూఎస్బీ టైప్-సి కనెక్టివిటీ అందిస్తుంది. కెనీల్ బే, బ్లాక్ బ్యూటీ, సూథింగ్ సీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

వాట్సాప్ లో 'న్యూ కాల్' ఆప్షన్ ?


వాట్సాప్ కాల్స్ సెక్షన్ లో కొత్త ఫీచర్స్ ను యాడ్ చేయడంపై వాట్సాప్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ ఫోకస్ పెట్టారు. వాట్సాప్ లో యూజర్ల కాలింగ్ ను ఇంకా బెటర్ చేసేందుకుగానూ కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ‘కాల్స్’ ట్యాబ్‌లో ప్రస్తుతం మనకు పై భాగంలో 'కాల్ లింక్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అయితే త్వరలో 'కాల్ లింక్' ఆప్షన్ స్థానంలో 'న్యూ కాల్' అనే సరికొత్త ఆప్షన్‌ చేరబోతోంది. వాట్సాప్ కాల్ కు మరో 31 మందిని యాడ్ చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వాట్సాప్ కాల్ కు 15 మందిని మాత్రమే యాడ్ చేసే ఫెసిలిటీ ఉంది. ఈమేరకు వివరాలతో Wabetainfo వెబ్ సైట్ ఒక రిపోర్టును పబ్లిష్ చేసింది. వాట్సాప్ కాల్ కు 31 మందిని యాడ్ చేసే అప్ డేట్ ప్రస్తుతం వాట్సాప్ బీటా 2.23.19.16 వర్షన్ లో టెస్టింగ్ దశలో ఉందని తెలిపింది. ఇక వీడియో కాలింగ్ అవతార్ ఫీచర్‌పై కూడా వాట్సాప్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇది అందుబాటులోకి వచ్చాక.. మనం ఎవరికైనా వీడియో కాల్ లను చేసినప్పుడు, మన ముఖానికి బదులుగా యూజర్ అవతార్‌ కనిపిస్తుంది. ఈ అవతార్‌లను మన ముఖ కవళికలు, సంజ్ఞలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా ఇప్పుడు బీటా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది.

Saturday, September 16, 2023

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ కారు లాంచ్ !


దేశీయ మార్కెట్లో  ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUV కారును రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కారు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు అక్టోబర్ 15న ప్రారంభమవుతాయి. C5 ఎయిర్‌క్రాస్ SUV కారు C3 హ్యాచ్‌బ్యాక్, E-C3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ తర్వాత C3 ఎయిర్‌క్రాస్ SUV భారత మార్కెట్లో సిట్రోయెన్ నాల్గవ మోడల్‌గా వచ్చింది. 90శాతం స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన C3 ఎయిర్‌క్రాస్ SUV తమిళనాడులోని సిట్రోయెన్ తిరువళ్లూరు ప్లాంట్‌లో తయారైంది. Citroen C3 Aircross SUV కారు మోడల్ యూ, ప్లస్, మాక్స్ అనే 3 వేరియంట్‌లలో అందిస్తోంది. ఎంట్రీ-లెవల్ యు వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇతర 2 వేరియంట్ల ధరలను కార్‌మేకర్ ఇంకా ప్రకటించలేదు. C3 ఎయిర్‌క్రాస్ SUV 5-సీటర్ లేఅవుట్ 5+2-సీటర్ లేఅవుట్‌లో అందుబాటులో ఉంది. మూడో వరుస సీట్లను తొలగించవచ్చు. U వేరియంట్ 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. మిగిలిన 2 వేరియంట్‌లు ఆఫర్‌లో 2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 2023లో C3 ఎయిర్‌క్రాస్ SUV లాంచ్ అయినప్పటి నుంచి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే, C3 Aircross SUV ప్రీ-లాంచ్ బుకింగ్స్ ప్రారంభం కాగా రూ. 9.99 లక్షల (షోరూమ్)కు సొంతం చేసుకోవచ్చు. హై లోకలైజేషన్‌తో భారత్‌లో టాప్ రేంజ్ ఆఫర్‌లను అందిస్తుందని స్టెల్లంటిస్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ బౌచార అన్నారు. C3 ఎయిర్‌క్రాస్ SUV డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం మల్టీఫేస్ సైన్ కోరుకునే భారతీయ కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించామని అన్నారాయన. C3 ఎయిర్‌క్రాస్ SUV హుడ్ కింద కంపెనీ 1.2-లీటర్ Gen-3 Turbo PureTech పెట్రోల్ ఇంజన్ అందిస్తుంది. గరిష్టంగా 110PS శక్తిని, 190Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ప్రస్తుతానికి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదని చెప్పవచ్చు. ARAI- వెరిఫైడ్ చేసిన C3 ఎయిర్‌క్రాస్ మైలేజ్ 18.5kmpl అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. వాహనంలో LED DRLలతో కూడిన హాలోజన్ రిఫ్లెక్టర్ హెడ్‌లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, డ్యూయల్-టోన్ రూఫ్ ఆప్షన్ ఉన్నాయి. క్యాబిన్ లోపల 10.23-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లను పొందవచ్చు. రూఫ్-మౌంటెడ్ AC వెంట్లు కూడా ఉన్నాయి. కానీ, 5+2-సీటర్ లేఅవుట్ వేరియంట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ నుంచి రెండు కొత్త ల్యాప్‌టాప్ లు!

మెరికా లో న్యూయార్క్ లో సెప్టెంబర్ 21న జరిగే "ప్రత్యేక ఈవెంట్"లో సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 3, సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో 2లను మైక్రోసాఫ్ట్ లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో 2 ల్యాప్‌టాప్ 14.4 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది, అయితే సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 3 ల్యాప్‌టాప్ 12.45-అంగుళాల డిస్‌ప్లేను పొందుతుంది. మునుపటిది ఇంటెల్ కోర్ i7-13800H ప్రాసెసర్‌తో అందించబడుతుంది, అయితే సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 3 ఇంటెల్ కోర్ i5-1235U SoC వరకు ప్యాక్ చేయబడుతుంది. టిప్ స్టర్ రోలాండ్ ఖ్వాండ్ట్ (@rquandt) మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 3 మరియు Surface Laptop Studio 2 గురించిన వివరాలను Winfutureలో పోస్ట్ చేసారు. నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇంటెల్ కోర్ i5-1235U SoC, 8GB RAM మరియు 256GB SSD నిల్వతో కూడిన వేరియంట్ కోసం EUR 899 (దాదాపు రూ. 76,000) ధర ట్యాగ్‌తో సర్ఫేస్ ల్యాప్‌టాప్ Go 3ని లాంచ్ చేయనుంది. ఇది అక్టోబర్ మొదటి వారం నుండి సేల్ చేయబడుతుంది అని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో 2 ఇంటెల్ Xe GPUతో కూడిన బేస్ మోడల్ కోసం EUR 2,249 (సుమారు రూ. 1,99,300) ధర ట్యాగ్‌తో వస్తుంది, అయితే RTX 4050, 16GB RAM మరియు 512GB SSDతో కూడిన వేరియంట్ EUR 2,729 (దాదాపు రూ. 2,41,000). 32GB RAM, 1TB SSD మరియు RTX 4060 కలిగిన మోడల్ ధర EUR 3,199 (దాదాపు రూ. 2,83,500), అయితే 64GB RAM మోడల్ ధర EUR 3,700 (దాదాపు రూ. 3,27,000). అక్టోబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో 2 యొక్క రెండర్‌లు ఈ పరికరంలో కొత్త మైక్రో SD కార్డ్ రీడర్ మరియు USB టైప్-A పోర్ట్‌ను సూచిస్తున్నాయి. నోట్‌బుక్ 1,600x2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 14.4-అంగుళాల పిక్సెల్‌సెన్స్ డిస్‌ప్లేను పొందుతుంది. ఇది ఇంటెల్ యొక్క రాప్టర్ లేక్-హెచ్ చిప్‌లతో వస్తుంది. నోట్‌బుక్ ఇంటెల్ కోర్ i7-13700H లేదా ఇంటెల్ కోర్ i7-13800H ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్ స్టూడియో 2 16GB, 32GB మరియు 64GB LPDDR5X RAM ఎంపికలలో అందించబడుతుంది. ఇంటెల్ కోర్ i7-13700H ప్రాసెసర్‌తో కూడిన వేరియంట్ GDDR6 మెమరీతో Nvidia GeForce RTX 4050 GPUతో జత చేయబడుతుంది. ఇంటెల్ కోర్ i7-13800H వేరియంట్ Nvidia యొక్క GeForce RTX 4060 GPU మరియు 8GB మెమరీని ప్యాక్ చేయగలదు. సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో 2 యొక్క ప్రాథమిక వెర్షన్ ఇంటెల్ SoCలో చేర్చబడిన Iris Xe GPUని కలిగి ఉంటుంది. ఇంకా, ఇది బేస్ స్టోరేజ్‌గా 512GB SSDని కలిగి ఉంటుంది. ఇది వివిధ మార్కెట్లలో 1TB మరియు 2TB SSD నిల్వ వరకు ఉంటుంది. ఇది 58Whr బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది 19 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 3 స్పెసిఫికేషన్‌లు దాని ముందున్న సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2కి దాదాపు సమానంగా ఉన్నాయని చెప్పబడింది.  రాబోయే మోడల్ 12వ తరం ఇంటెల్ కోర్ i5-1235U CPUపై రన్ అవుతుంది. ఇది 12.45 అంగుళాల పిక్సెల్‌సెన్స్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. నోట్‌బుక్ ప్రాథమిక మోడల్ 8GB RAM మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 5,403mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 

తప్పిపోయిన వారికి సహాయపడే క్యూఆర్ కోడ్ లాకెట్లు !


ప్పుడున్న టెక్నాలజీ లో క్యూఆర్ కోడ్ అనేది కీలకంగా మారింది. నగదు బదిలీలకే కాదు ఇప్పుడు మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయో లేదా, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోతే వారిని ఇంటికి చేర్చేందుకు ఉపయోగపడే క్యూఆర్ కోడ్ ని ఓ యువ ఇంజనీర్ రూపొందించారు. కుటుంబ నుంచి తప్పిపోయి తమ ఇంటి వివరాలు చెప్పలేనివాళ్ల కోసం క్యూఆర్ కోడ్ చక్కటి సాధనంగా ఉపయోగపడుతుంది. బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ క్యూఆర్ కోడ్ ఉన్న లాకెట్ చక్కటి సహాయకారిగా ఉంటుంది. అక్షయ్ రిడ్లాన్ అనే 24 ఏళ్ల డేటా ఇంజనీర్ అభివృద్ధి చేశాడు.  దివ్యాంగులు, వికలాంగులు, అల్జీమర్ బాధితులు,వృద్ధులు పొరపాటున ఒక్కోసారి వారు తమవారి నుంచి తప్పిపోతే ఈ లాకెట్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా వారి సొంతవారిని గుర్తించవచ్చు. ఇటువంటివారు తమ ఇళ్ల నుండి బయటికి వెళ్లినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారితప్పిపోయే అవకాశాలున్నాయి. అలా జరిగితే వారి ఆచూకీ తెలుసుకోవటానికి ఈ క్యూఆర్ కోడ్ లాకెట్లు ఉపయోగపడతాయి. మానసిక వైకల్యం, ట్రీట్ మెంట్ పరంగా ఎమర్జన్సీ పరిస్థితులతో ఉన్నవారి కోసం ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత లాకెట్లు అందించటానికి చేతన  ప్రాజెక్ట్ చేపట్టారు. దీని ద్వారా బాధితులు వారి కుటుంబాలను సులభంగా చేరుకోవచ్చు. ఎవరైనా లాకెట్టులో కస్టొమైజ్డ్ QR కోడ్‌లను స్కాన్ చేస్తే..ఆ లాకెట్ ధరించిన వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక వివరాలను తెలుస్తాయి. ఈ కోడ్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు. ఆ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ లాకెట్ ధరించినవారి పేరు, వారి ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ అలా వారి బ్లడ్ గ్రూప్ వంటివి దీంట్లో పొందుపరచబడి ఉంటాయి.


ఐఫోన్15లో NavIC టెక్నాలజీ !


ఫోన్15  ప్రో, ఐఫోన్15 ప్రో మాక్స్  ఫోన్లలో దేశీయ టెక్నాలజీ అయిన నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ ని తీసుకువస్తుంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్  అనేది ఇండియా స్వతహాగా రూపొందించుకున్న జీపీఎస్ లాంటి నావిగేషస్ టెక్నాలజీ. దేశీయ టెక్నాలజీని ఐఫోన్లలో తీసుకురావడం ఇదే తొలిసారి. అయితే ఐఫోన్ 15, ఐపోన్ 15 ప్లస్ వెర్షన్లలో మాత్రం ఈ టెక్నాలజీ పనిచేయదు. ఐఫోన్ 15లో NavIC తో పాటు గెలీలియో, GLONASS వంటి జీపీఎస్ సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అమెరికా, రష్యా, చైనాలకు ఉన్నవిధంగానే భారత్ కు కూడా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అవసరం ఉందని ఇస్రో భావించి NavIC వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఇది ఇండిపెండెంట్ స్టాండ్-లోనే నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. 2006లో ప్రారంభమైన నావిక్, 2011లో ప్రారంభమవుతుందని అంచనా వేసినప్పటికీ, 2018లో ప్రారంభమైంది. ఇది ఇండియా కొరకు పనిచేసే ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ. నావిక్ శాటిలైట్ వ్యవస్థని ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం చాలా దేశాలు అమెరికా నావిగేషన్ వ్యవస్థ అయినటువంటి GPSని కలిగి ఉంటుంది. ఇదే విధంగా భారత్ కూడా తన దేశ అవసరాలకు, రక్షణకు ఉద్దేశించి నావిక్ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం 7 శాటిలైట్లు పనిచేస్తాయి. ప్రస్తుతం నావిక్ దేశంలో పబ్లిక్ వెహికిత్ ట్రాకింగ్‌లో ఉపయోగించబడుతోంది. ఇది కాకుండా, సముద్రంలో వెళ్లే మత్స్యకారులకు అత్యవసర హెచ్చరికలు అందించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. నావిక్ ప్రకృతి విపత్తులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 7 శాటిలైట్లు, గ్రౌండ్ స్టేషన్లు 24/7 పనిచేస్తాయని ఇస్రో తెలిపింది. ఈ 7 శాటిలైట్లలో 3 'జియో స్టేషనరీ ఆర్బిట్(భూస్థిర కక్ష్య)'లో, మరో 4 జియో సింక్రోనస్ కక్ష్యలో ఉన్నాయి. నావిక్ శాటిలైట్ వ్యవస్థ రెండు రకాల సేవల్ని అందిస్తోంది. SPS (స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్) పౌర సేవల కోసం, RS (నియంత్రిత సేవ) వ్యూహాత్మక ప్రయోజనాల కోసం. ఈ వ్యవస్థ దేశంతో పాటు దేశ సరిహద్దుల నుంచి 1500 కి.మీ వరకు కవరేజ్ చేస్తుంది. నావిక్ 20 మీటర్ల కంటే మెరుగైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. 50 ns కంటే మెరుగైన టైమ్ ఆక్యురసీని అందిస్తుంది. నావిక్ SPC సిగ్నల్స్ జీపీఎస్, GLONASS, గెలీలియో, బీడౌ అనే ఇతర గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సిగ్నల్‌లతో పరస్పరం పనిచేయగలవు

స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి !


చిన్నారులు స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తున్నారని సంతోషించే పేరెంట్స్‌ అనారోగ్యాన్ని పంచుతున్నారని తెలుసుకోలేక పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పిల్లలు గంటల తరబడి టీవీ చూడడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంది. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. చిన్నతనంలో అధికంగా ఫోన్‌ చూసే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 5ఏళ్ల లోపు చిన్నారులు రోజులో ఒక గంట కంటే ఎక్కువ ఫోన్‌ చూడకూడదని చెబుతున్నారు. పిల్లలకు స్క్రీన్‌ టైమ్‌ను వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు. రేడియేషన్‌ ప్రభావం కూడా పిల్లలపై నెగిటివ్‌ ఇంపాక్ట్ చూపుతుందని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌ల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్‌ వారి కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చిన్నారుల నిద్రపై కూడా దుష్ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారి, ఎవరితో మాట్లాడకుండా ఉండే చిన్నారుల మానసిక ప్రవర్తనలోనూ భయంకరమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు. పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీని పెంచాలని, స్మార్ట్ ఫోన్‌ల వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కే 43 విడుదల !


దేశీయ మార్కెట్లోకి షియోమీ సంస్థ రెడ్ మీ సిరీస్ లో  43-అంగుళాల రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కే 43ని ఈ రోజు విడుదల చేసింది. ఈ సరికొత్త స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో ప్రత్యేకమైన డిజైన్ మరియు నాణ్యమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ డిస్‌ప్లే 3840 x 2160 పిక్సెల్‌లు, ఆటో తక్కువ లేటెన్సీ మోడ్, 6.5ఎంఎస్ రెస్పాన్స్ టైమ్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. అలాగే, ఈ రెడ్‌మీ టీవీలో వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉంది. థియేటర్ అనుభూతిని అందిస్తుంది. మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌ తో పాటు  క్వాడ్-కోర్ కార్టెక్స్ A55 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు గేమింగ్ ప్రియులను ఆకర్షించేందుకు Mali-G52 MC1 GPU గ్రాఫిక్స్ కార్డ్ ఇవ్వబడింది. Fire OS 7 పై పనిచేస్తుంది. అలాగే ఈ TV 2GB RAM మరియు 8GB స్టోరేజీ సౌకర్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, డిస్నీ+ హాట్ స్టార్, Zee5, సోనీ లైవ్, యూట్యూబ్ మొదలైన వివిధ యాప్‌లను ఈ సరికొత్త స్మార్ట్ టీవీలో ఉపయోగించవచ్చు. 43 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ అలెక్సా వాయిస్ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్ రిమోట్‌ను కలిగి ఉంది. కాబట్టి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో కూడిన ఈ రిమోట్‌తో మీరు టీవీని అందంగా ఆపరేట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కోసం షార్ట్‌కట్ బటన్‌లు ఉన్నాయి. వై-ఫై 802.11 AC, ఎయిర్‌ప్లే 2, మిరాకాస్ట్, బ్లూటూత్ 5.0, HDMI పోర్ట్, USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్, ఈథర్‌నెట్, యాంటెన్నా వంటి బహుళ కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి. 43-అంగుళాల రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీని రూ. 26,999కి విడుదల చేశారు. అయితే, పరిమిత సమయం వరకు, 43 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ రూ.24,999 ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ సేల్ తేదీని ఇంకా పేర్కొనలేదు. అయితే, ఈ టీవీ రాబోయే పండుగ సీజన్‌లో Mi.com మరియు అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Popular Posts