Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, October 1, 2023

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ !


మెరికాలోని లాస్‌ వెగాస్‌ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. గోళాకారంలో రూ. 16వేల కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ఈ తెరను లాంఛనంగా ప్రారంభించారు. 2018లో వెనీషియన్ రిస్టార్టులో యూ2 పేరుతో ఈ స్క్రీన్ నిర్మాణం మొదలైంది. దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు. హైరిజల్యూన్ ఫీచర్ ఉన్న ఈ తెరముందు 17,500 మంది కూర్చుని ప్రదర్శన తిలకించవచ్చు. మిలియన్లకొద్దీ ఎల్‌ఈడీ లైట్లను జోడించి ఈ తెరను రూపొందించారు. అమెరికా వ్యాపారవేత్త జేమ్స్‌ డోలన్‌ దీన్ని నిర్మించాడు. బయటి భాగంపై రంగురంగుల చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తున్నారు. లోపలి స్క్రీన్ కళ్లు తిరిగిపోయేలా ఉంటుందని, మరో గ్రహగోళంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. గత శుక్రవారం ఐరిష్‌ రాక్‌ బ్యాండ్‌ ప్రదర్శనతో ఈ తెరను ప్రారంభించారు.

లెనెవో నుంచి లెనెవో ట్యాబ్‌ ఎమ్‌11


లెనొవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. లెనెవో ట్యాబ్‌ ఎమ్‌11 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకు రానుంది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌ 11 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,920 x 1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ఇక లెనోవో ట్యాబ్‌ ఎమ్‌11 మీడియా టెక్‌ హీలియో జీ88 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ట్యాబ్‌ను మూడు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. 4జీబీ, 8 జీబీ, 12 జీబీ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. అంతేకాకుండా మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 10 గంటల తరబడి పనిచేస్తుంది. ట్యాబ్ బరువు 466 గ్రాములు ఉంది. కెమెరా విషయానికొస్తే మాత్రం లెనోవో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా ఈ ట్యాబ్‌లో సింగిల్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో డాల్బీ ఆటమ్స్‌ సౌండ్ ఇవ్వనున్నారని సమాచారం. లెనోవో ట్యాబ్ ఎమ్‌11లో 5v/2A ఛార్జింగ్‌ అడాప్టర్‌ను ఇవ్వనున్నారు. 

గంటల్లోనే లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ హాట్‌ సేల్‌ !


దేశీయ మార్కెట్లో జర్మనీ లగ్జరీ కార్‌ మేకర్‌ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్‌లు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో తీసుకొచ్చింది. బుకింగ్స్‌ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్‌ను నమోదు చేసింది. ఈ హాల్‌ సేల్‌లో ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన ఈ ఎస్‌యూవీ డెలివరీలో అక్టోబర్‌లో ప్రారంభం. లాంచింగ్‌ రోజే iX1 SUVకి 'అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్‌ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు. డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్‌లైట్లు LED హెడ్‌ల్యాంప్‌లు రన్నింగ్ బోర్డ్‌లతో పాటు ముందు మరియు వెనుక బంపర్‌లో బ్లూ యాక్సెంట్‌లతో దాదాపు చతురస్రాకారంలో గ్రిల్‌ను అమర్చింది. iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100 కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్‌పి పవర్‌ను గరిష్టంగా 494 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్‌ అవుతుంది. ఆల్ఫ్‌లైన్‌ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో విడుదల చేసింది. 10.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్‌ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్‌ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.

రెడ్‌మీ ఉత్పత్తులపై దివాలీ ఆఫర్లు !


దివాలీ విత్ ఎంఐ సేల్ 2023 పేరిట ఆన్ లైన్ లో జియోమీ పలు ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి ఇతర డివైజ్ లలో కూపన్ డిస్కౌంట్లు అందించనుంది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా రాలేదు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 జరిగే సమయంలోనే ఇది కూడా ఉండే అవకాశం ఉంది. జియోమీ దివాలీ విత్ ఎంఐ సేల్ 2023 తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ సేల్లో జియోమీకి చెందిన పలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై ఆఫర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, రెడ్ మీ ప్యాడ్ ఎస్ఈ వంటి ట్యాబ్లెట్‌లు దివాలి విత్ ఎంఐ 2023 సేల్‌లో తగ్గింపు ధరలకు లభించే అవకాశం ఉంది. ఈమేరకు కంపెనీకి చెందిన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఓ టీజర్ ను విడుదల చేసింది. దీనిలో 5జీ రెడీ స్మార్ట్‌ఫోన్‌లపై స్మార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. కొనుగోలుదారులు గేమ్ లాంజ్ ద్వారా రివార్డ్‌లను గెలుచుకోవడంతో పాటు ప్రతిరోజూ కొత్త సర్ ప్రైజ్ లను కూడా అన్‌లాక్ చేయవచ్చు. ఈ దివాలి విత్ ఎంఐ సేల్‌లో పాల్గొనడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడానికి, ఆహ్వానించడానికి కొనుగోలుదారులకు కంపెనీ ఫ్రీబీలను కూడా అందిస్తుంది. ఏయే ఉత్పత్తులు ఆఫర్లపై విక్రయించనుందో జియోమీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ 13 సిరీస్ ఫోన్లు అయిన రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో+ , బేస్ మోడల్, రెడ్‌మీ ఎ2+ , రెడ్‌మీ కె60, అల్ట్రా, రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‌మీ 12 5జీ వంటి స్మార్ట్ ఫోన్లపై పండుగ తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. వీటితో పటు ఇటీవల ప్రారంభించిన కొన్ని ఎంఐ ఉత్పత్తులు కూడా అమ్మకానికి వెళ్ళవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి గృహోపకరణాలు, స్మార్ట్‌వాచ్‌లు, టీవీ స్టిక్‌ల వరకు సేల్ లో కనిపించే అవకాశం ఉంది.

కంపెనీ సీఈఓగా ఏఐ రోబోట్ మికా !


పోలాండ్ కు చెందిన మత్తు పానీయాలు తయారు చేసే కంపెనీ మికా హ్యుమనోయిడ్ రోబోను డిక్టేడార్ కు ప్రయోగాత్మక సీఈఓగా నియమించింది. ఈ కంపెనీ రమ్ కు ప్రసిద్ధి చెందింది. దీనిలో రోబో సంస్థ అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది, ఇందులో వన్-ఆఫ్ కలెక్షన్లు, కమ్యూనికేషన్లు, వ్యూహాత్మక ప్రణాళికలు కూడా ఉంటాయి. డిక్టేడార్‌లోని యూరప్ హెడ్ మార్క్ స్జోల్డ్‌రోవ్స్కీ ప్రకారం, “డిక్టేడార్ బోర్డు నిర్ణయం విప్లవాత్మకమైనది, సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. కంపెనీ అభివృద్ధి చేసిన ఏఐతో కూడిన ఈ మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ ఓ కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ మికా రోబో కస్టమ్ బాటిళ్లను రూపొందించడానికి కళాకారులను ఎంపిక చేయడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. సంస్థ అన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోబోట్ తీసుకుంటుంది. లాభనష్టాలు, మార్కెటింగ్ వ్యూహం, వ్యాపార వ్యూహం సహా అన్ని విషయాలను ఈ ఏఐ చూసుకుంటుంది. కంపెనీకి మరింత మార్కెటింగ్‌కు ఎలా ముందుకు వెళ్లాలో ఇది నిర్ణయిస్తుంది. ఎక్కడ పెట్టుబడులు లాభపడతాయో అంచనా వేస్తుంది. అంతేకాదు ఈ మికా ఆఫీసు లోపల కూడా సందడి చేస్తుంది. అంటే ఏ డిపార్ట్ మెంట్ పని బాగా జరుగుతోందని, ఎవరు పని సరిగా చేయడం లేదనే విషయాలను ఈ రోబో గమనిస్తూనే ఉంటుంది. ఏ వర్కర్ ఎక్కడ అవసరం, పని పరిధి ఎలా ఉంటుందో మికానే చెబుతుంది. ప్రతి కార్మికుడి పనితీరును తనిఖీ చేస్తుంది. ప్రతి ఉద్యోగి ప్రమోషన్-ఇంక్రిమెంట్ ఈ కృత్రిమ మేధస్సు రోబో చేతిలో ఉంటుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు యావత్ ప్రపంచం దీనిపై దృష్టి సారించింది.

వారంటీ తిరస్కరించినందుకు ఆపిల్ సంస్థకు రూ. లక్ష జరిమానా !

                                       

బెంగళూరు వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆపిల్ సంస్థకు రూ. లక్ష పెనాల్టీ విధించింది. బెంగళూరుకు చెందిన వాజ్ ఖాన్ (30) అనే వ్యక్తి 2021 అక్టోబర్‌ 29న ఐఫోన్13 కొనుగోలు చేశాడు. ఈ ఫోన్ మీద  ఆపిల్ ఏడాది వారంటీ ఇచ్చింది. కొనుగోలు చేసిన కొన్ని నెలలకే ఆ ఫోన్ బ్యాటరీ, స్పీకర్‌తో సమస్యలు రావడంతో దాని మరమ్మతు కోసం 2022 ఆగస్టు 25న స్థానిక సర్వీస్ సెంటర్‌లో ఇచ్చాడు. ఆగస్టు 30వ తేదీన సర్వీస్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది.. 'మీ ఐ-ఫోన్‌లో లోపం సరి చేశామని, ఫోన్ తీసుకెళ్లవచ్చునని` ఆ ఫోన్ కాల్ చేసిన వారు చెప్పారు. కానీ ఫోన్‌లో లోపం యధాతథంగానే కొనసాగుతున్నదని, తిరిగి సర్వీస్ సెంటర్ వారికి ఇచ్చారు. రెండు వారాల్లో మరమ్మతు చేసి ఇస్తామని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సమాధానమిచ్చారు. కానీ రెండు వారాలు దాటినా వాజ్ ఖాన్‌కు ఎటువంటి సమాధానం రాలేదు. తర్వాత తీరిగ్గా.. ఆయన కొన్న 'ఐ-ఫోన్ 13'లో ఔటర్ మెష్‌లో జిగురు పదార్థం ఉందని, వారంటీలో దాన్ని తొలగించలేమని, తొలగించాలంటే, అదనంగా మనీ చెల్లించాలని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు తీరిగ్గా చెప్పారు. దీనిపై పలుమార్లు ఆపిల్ సంస్థకు ఈ-మెయిల్స్ పంపినా స్పందన కరువైంది. గతేడాది అక్టోబర్ 27న ఆపిల్‌కు లీగల్ నోటీసు కూడా పంపాడు. తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో 2022 డిసెంబర్‌లో జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. వాజ్ ఖాన్ కు పరిహారం చెల్లించాలని ఆపిల్, ఆ సంస్థ సర్వీస్ భాగస్వామిని ఆదేశించింది. రూ.79,900 పరిహారంతోపాటు మరో రూ.20 వేలు వడ్డీ చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.

Saturday, September 30, 2023

వొడాఫోన్ ఐడియాకు రూ.కోటి పెనాల్టీ !


రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్‌ ఐడియాకు భారీ జరిమానా రూపంలో ట్రాయ్‌ షాకిచ్చింది. ఇబ్బందికరమైన కాల్స్‌, SMSలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తమకు రూ.కోటి పెనాల్టీని విధించినట్లు వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 28న జరిమానా విధించినట్లు వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిర్యాదుల కోసం కంపెనీ నెట్‌వర్క్ ద్వారా పంపిన అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ (UCC)ని అరికట్టడంలో వొడాఫోన్‌ ఐడియా వైఫల్యం చెందినట్లు ట్రాయ్‌ పేర్కొంది. ఈ ఆర్డర్‌ని సమీక్షిస్తున్నామని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని వొడాఫోన్‌ ఐడియా ఫైలింగ్‌లో తెలిపింది.వొడాఫోన్‌ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌-జూన్‌ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. మరోవైపు జూన్‌ నెలలో 12.8 లక్షల మంది యూజర్లను ఈ టెలికాం కంపెనీ కోల్పోయింది.

'మోటో E13' విడుదల !


మోటో E13 కొత్త కలర్ వేరియంట్‌ను మోటొరోలా విడుదల చేసింది. ఇప్పుడు ఛార్మింగ్‌ 'స్కై బ్లూ' కలర్‌లో ఫోన్ లభిస్తుంది.8GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మోటో E13 లైనప్‌లో ఇప్పటికే క్రీమీ వైట్, అరోరా గ్రీన్, కాస్మిక్ బ్లాక్ వంటి మూడు కలర్ వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ కొత్తగా మోటో E13ని నాలుగో కలర్ ఆప్షన్‌లో అందిస్తూ, దీనిపై భారీ ఆఫర్లు సైతం ప్రకటించింది. ఈ వివరాలను మోటొరోలా, ఎక్స్‌ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేసుకుంది.మోటొరోలా మోటో E13ని ఈ ఫిబ్రవరిలో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్ 2GB+64GB, 4GB+64GB అనే రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. ఆగస్టులో 8GB+128GB వేరియంట్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్‌లో రిలీజ్ అయింది. మోటో E13 పండుగ ప్రత్యేక ధర రూ.6,749తో అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్‌ అసలు ధర రూ.8,999. ఈ డిస్కౌంట్‌లో బ్యాంక్ ఆఫర్లు కలిసి ఉన్నాయి. ఈ ఆఫర్లు లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499కి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ మోటొరోలా వెబ్‌సైట్, రిటైల్ అవుట్‌లెట్‌లలో కూడా అందుబాటులో ఉంది. కలర్‌ ఆప్షన్‌లు మినహా మోటో E13 స్పెసిఫికేషన్లు అలానే ఉంటాయి. మోటో E13లో 20:9 యాస్పెక్ట్‌ రేషియోలో, 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. వినియోగదారులకు అన్ని మల్టీమీడియా యాక్టివిటీస్‌లో ఇమ్మెర్సివ్‌ విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. ఫోన్ Unisoc T606 ప్రాసెసర్‌తో బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అందిస్తుంది. మోటో E13 మెమరీ, స్టోరేజ్ విషయానికి వస్తే.. మూడు వేరియంట్‌లు 64GB స్టోరేజ్‌ 2GB RAM, 64GB స్టోరేజ్‌ 4GB RAM, 128GB స్టోరేజ్ 8GB RAM అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 13MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది షార్ప్‌, వైబ్రెంట్‌ ఫోటోలను క్యాప్చర్‌ చేస్తుంది. అయితే 5MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు అనువుగా ఉంటుంది. మోటో E13 ప్రత్యేకమైన ఫీచర్‌లలో ఒకటి స్ట్రాంగ్‌ 5,000mAh బ్యాటరీ. ఫోన్ 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మోటో E13 ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌పై రన్ అవుతుంది. ఇది విస్తృత శ్రేణి యాప్‌లు, ఫీచర్‌లకు యాక్సెస్‌తో పాటు యూజర్‌-ఫ్రెండ్లీ, అప్‌ టూ డేట్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.


హాట్‌స్టార్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై పరిమితుల విధింపు !


డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ కూడా పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై పరిమితులను పెట్టింది. ఈ తాజా వార్త డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సబ్‌స్క్రైబర్లకు షాకింగ్‌ విషయంగా ఉంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ తన కస్టమర్‌లు తమ ఆధారాలను ఇతరులతో పంచుకోకుండా నిషేధిస్తుంది. హాట్‌ స్టార్‌ నవంబర్ 1 నుంచి కెనడాలో ఈ కొత్త నియంత్రణను అమలు చేస్తోంది. ఈ మార్పుల గురించి తెలియజేస్తూ ఖాతా షేరింగ్‌ని నిషేధించడానికి వినియోగదారులకు ఇప్పటికే ఈ-మెయిల్ పంపింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే డిస్నీప్లస్‌ కొత్త నిబంధనలను అమలు చేయడంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వాటిని ఉల్లంఘించిన వారి ఖాతాలను పరిమితం చేయడం లేదా రద్దు చేస్తామని హెచ్చరిస్తుంది. ఈ తాజా చర్య ముఖ్యంగా అర్హత కలిగిన వినియోగదారులను గుర్తించడానికి కూడా ఒక మార్గాన్ని కలిగి ఉంటుంది. ఈ తాజా చర్య సంభావ్య చెల్లింపు సభ్యులను దూరంగా ఉంచుతుంది. స్నేహితుని సభ్యత్వాన్ని ఉపయోగించడం కంటే ఎక్కువ మంది వినియోగదారులను దాని సేవ కోసం చెల్లించమని ప్రోత్సహించడానికి ప్లాట్‌ఫారమ్ సమానంగా కట్టుబడి ఉందని ఇది సూచిస్తుంది. అయితే డిస్నీ ప్లస్‌ చిరునామా ఒకే ఐపీ చిరునామాపై నడుస్తున్న వ్యక్తులు లేదా పరికరాలను కుటుంబ సభ్యులు పొందే అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాల్లో ప్లాట్‌ఫారమ్ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి వారి స్నేహితులను ఎనేబుల్ చేయడానికి ప్రజలు అదనపు ధరను చెల్లించే అవకాశం కూడా ఉంది. నిర్దిష్ట మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని డిస్నీ దాని అమలు కోసం ఫ్రేమ్‌వర్క్‌ను సెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిబంధనలు భారతదేశంలో ఎప్పుడు అమలవుతుందో? అనే విషయం ఇప్పటివరకూ తెలియలేదు. నెట్‌ఫ్లిక్స్ దాని పాస్‌వర్డ్ అణిచివేత సంస్కరణను దేశంలో అమలు చేసినందున డిస్నీ ప్లస్‌ అలాగే చేస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Popular Posts