

ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ లేని వ్యవస్థ, రంగం ఏదీ లేదు. కంప్యూటర్ లేని జీవనాన్ని ఊహించుకోవడమే కష్టం. ఇంతవరకూ మానవుడు నిర్మించిన మరే సాధనమూ కంప్యూటర్ చూపిన ప్రభావం చూపలేదంటే దాని శక్తిని అంచనా వెయ్యచ్చు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన కంప్యూటర్ రంగంలో మన దేశం కూడా ఎంతో పురోగతిని సాధంచింది. కంప్యూటర్లలో రెండు రకాలు కలవు. సాధారణ అవసరాలు అనగా విద్య, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్ లాంటి వాటిలో మొదటి రకం వాడుతుంటారు. రెండవ రకం కర్మగారములలో, భారీ సంస్థలలో, అధిక డేటా ఉండే సర్వర్లకు, మిలటరీ అవసరాలకు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో రోబోట్‌లను నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి.