Ad Code

టెక్‌ కార్నర్‌

సూపర్‌ కంప్యూటర్‌
ఎక్కువ స్పీడ్‌, పనితనాన్ని చూపగలిగే అతి పెద్ద కంప్యూటర్లను సూపర్‌ కంప్యూటర్లుగా పిలుస్తారు.
సూపర్‌ ఫ్లాపీ
సాధారణ కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ నిల్వ చేయగలిగే ఫ్లాపీలను సూపర్‌ ఫ్లాపీలంటారు.
స్టాటిక్‌ ర్యామ్‌
ఎస్‌ర్యామ్‌గా కూడా పిలిచే ఈరకమైన ర్యామ్‌ చిప్‌లలో డేటా ఒకసారి లోడ్‌ చేసిన తరువాత కరెంట్‌ పోయేవరకు (కంప్యూటర్‌ ఆఫ్‌ అయ్యేవరకు) మన తీయకపోతే తొలగిపోదు. ఈ రకమైన మెమోరీని క్యాచ్‌ మెమోరికి ఉపయోగిస్తారు. జనరల్‌గా ర్యామ్‌గా ఉపయోగపడే డైనమిక్‌ ర్యామ్‌లో డేటాని తరచూ రిఫ్రెష్‌ చేయవలసి వుండగా దీనిలో అటువంటి అవసరం వుండదు.
స్టెప్పర్‌ మోటార్‌
డిస్క్‌ డ్రైవ్‌ల్లో ఏక్సెస్‌ ఆర్క్‌ని కంట్రోల్‌ చేస్తూ ఒకసారి నిర్దేశితప్రదేశాన్ని మాత్రమే త్రిప్పడానికి ఉపయోగించే చిన్న మోటార్‌ని స్టెప్పర్‌ మోటార్‌ అంటారు. ఈ స్టెప్పర్‌ మోటార్లను ఇటువంటి అవసరం కలిగిన ఇతర పరికరాలలో కూడా ఉపయోగిస్తారు.
స్టాఫ్‌ బిట్‌
ఏదైనా ట్రాన్స్‌మిషన్‌ పూర్తయిన తరువాత ఆ సమాచారాన్ని తెలియజేయడానికి పంపించే సిగల్‌ని స్టాప్‌ బిట్‌ అంటారు.
స్టోరేజ్‌
కంప్యూటర్లలో డేటాని నిల్వ చేయడాన్ని స్టోరేజ్‌ అంటారు. ఇటువంటి పనికి ఉపయోగించే ప్లాఫీ, సిడి, డివిడి డ్రైవ్‌ లాంటి వాటిని స్టోరేజ్‌ డివైజెస్‌గా పేర్కొంటారు. డేటా నిల్వచేసే ఫ్లాపీ, సిడి, డివిడిలాంటి వాటిని స్టోరేజ్‌ మీడియాగా పిలుస్తారు.
స్ట్రీమింగ్‌ టేప్‌
మొత్తం హార్డ్‌ డిస్క్‌లోని డేటాని బేకప్‌ తీసుకోవడానికి పనికి వచ్చే హై కెపాసిటీ, హైస్పీడ్‌ మేగటిక్‌ టేప్‌లను స్ట్రీమింగ్‌ టేప్‌లంటారు.
స్ట్రింగ్‌
ప్రోగ్రామింగ్‌ పరిభాషలో ఏదైనా ఒక ప్రోగ్రామ్‌కి అందజేయబడే అల్పాన్యూమరిక్‌ కేరెక్టర్ల సమూహాన్ని ఆ ప్రోగ్రామ్‌ ఒకే యూనిట్‌గా గుర్తించేటట్లయితే ఆ సమూహాన్ని స్ట్రింగ్‌ అంటారు.
స్ట్రింజీ ప్లాపీ
తొలి తరం పర్సనల్‌ కంప్యూటర్లలో డేటాని నిల్వ చేయడానికి ఉపయోగించే 1/16'' టేప్‌ను స్ట్రింజీ ప్లాపీ అంటారు.
స్ట్రిపింగ్‌
డేటా ఏక్సెస్‌ వేగం పెంచడానికి డేటాని ఇంటర్‌లీప్‌ లేదా మల్టీ ప్లెక్సింగ్‌ చేయడాన్ని స్ట్రిపింగ్‌ అంటారు. ఉదాహరణకు డేటా సర్వర్లలో డేటాని కొన్ని భాగాలు చేసి వేర్వేరు హార్డ్‌డిస్క్‌ల్లో నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఒకేసారి ప్రోసెసర్‌ వేర్వేరు హార్డ్‌ డిస్క్‌ల నుంచి ఆ డేటా యొక్క వేర్వేరు భాగాలను గ్రహిస్తుంది. దీనివల్ల డేటా ఏక్సెస్‌ వేగం గణనీయంగా పెరుగుతుంది.
స్ట్రోక్‌ ఫాంట్‌
గీతల ద్వారా తయారు చేయబడే ఫాంట్స్‌ను స్ట్రోక్‌ ఫాంట్‌గా పిలుస్తారు. సాధారణంగా అవుట్‌లైన్‌ ఫాంట్స్‌లో ఒక షేప్‌ను పిల్‌ చేయడం ద్వారా అక్షర రూపం పొందితే, స్ట్రోక్‌ ఫాంట్స్‌ల ఆ విధంగా పూర్తిగా ఫిల్‌ చేయకుండా మధ్యలో గీతలుంటాయి.
స్టయిల్‌ షీట్‌
వర్డ్‌ ప్రోసెసింగ్‌, డిటిపి వంటి అప్లికేషన్స్‌లో ఒక తరహా డాక్యుమెంట్‌ యొక్క లే అవుట్‌ సెట్టింగ్స్‌ని కలిగి ఉండే ఫైల్‌ని స్టయిల్‌ షీట్‌ అని అంటారు. మార్జిన్‌, ట్యాబ్‌, హెడర్స్‌, ఫుటర్స్‌, కాలమ్స్‌, ఫాంట్స్‌ వంటి మేకప్‌కు అవసరమైన అన్ని సెట్టింగ్స్‌ దీనిలో వుంటాయి.
స్టయిలెస్‌
కంప్యూటర్‌లో ఉపయోగించే ఇన్‌ఫుట్‌ పరికరం ఇది. పెన్సిల్‌లా వుండే దీనితో ప్రత్యేకంగా వుండే సెన్సర్స్‌పై వ్రాసినా, గీసినా అవి స్క్రీన్‌పై కనబడతాయి. ఈ పరికరం మౌస్‌ కన్నా ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.
సబ్‌ డైరెక్టరీ
ఒక డైరెక్టరీలో వుండే మరో డైరెక్టరీని సబ్‌ డైరెక్టరీగా పిలుస్తారు. డాస్‌ మరియు ఓఎస్‌/2 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో దీన్ని డైరెక్టరీగా పిలుస్తారు. అదే విండోస్‌లో అయితే పోల్డర్స్‌గా పిలుస్తారు.
సబ్‌ మెనూ
ఏదైనా అప్లికేషన్లలో ఒక మెనూలోని ఒక ఐటెమ్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే మరొక మెనూ కనబడితే దానిని సబ్‌ మెనూ అంటారు.
సబ్‌ రొటీన్‌
ప్రత్యేకగా వ్రాయబడి అవసరాన్నిబట్టి ప్రోగ్రాంలో కాల్‌ చేయడం ద్వారా వాడటానికి వ్రాయబడిన ప్రోగ్రామ్‌ని సబ్‌ రొటీన్‌ అంటారు. ప్రత్యేక పనికి సబ్‌ రొటీన్‌ రాస్తే మెయిన్‌ ప్రోగ్రాంలో ఆ పని అవసరమైన ప్రతిసారీ తిరిగి ఆ కోడ్‌ మొత్తం రాయనవసరంలేకుండా అవసరమైనప్పుడల్లా దాన్ని ఉపయోగించుకోవచ్చు. పెద్ద వాటిని మాడ్యూల్స్‌ లేదా ప్రోసీజర్‌లుగా పిలిస్తే, చిన్నవాటిని మైక్రో లేదా ఫంక్షన్‌గా పిలుస్తారు.
సబ్‌ స్కీమా
డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌లో వినియోగదారునికి కనబడే ఆ భాగాన్ని సబ్‌ స్కీమా అంటారు. మొత్తం డేటాబేస్‌ను స్కీమాగా పిలుస్తారు.
సబ్‌ స్క్రిప్ట్స్‌
వర్డ్‌ ప్రోసెసింగ్‌ మరియు మేథమేటిక్స్‌లో సాధారణ టెక్ట్స్‌లోని అక్షరాలకు క్రింది భాగంలో కనబడే అక్షరాలు లేదా అంకెలను సబ్‌ స్క్రిప్ట్స్‌ అంటారు. (ఉదా: న2ఉ,జశీ2)
సూపర్‌ స్క్రిప్ట్స్‌
వర్డ్‌ ప్రోసెసింగ్‌ మరియు మేథమేటిక్స్‌లో సాధారణ టెక్ట్స్‌లోని అక్షరాలకు పై భాగంలో కనబడే అక్షరాలు లేదా అంకెలను సబ్‌ స్క్రిప్ట్స్‌ అంటారు. (ఉదా: న2ఉ,జశీ2)
సబ్‌ స్ట్రింగ్‌
ఏదైనా ఒక అల్ఫా న్యూమరిక్‌ ఫీల్డ్‌ లేదా వేరియబుల్‌లోని కొంత భాగాన్ని సబ్‌ స్ట్రింగ్‌ అంటారు. ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలో సబ్‌ స్ట్రింగ్‌ ఫంక్షన్‌ ద్వారా ఏదైనా ఒక ఫీల్డ్‌ లేదా వేరియబుల్‌లోని కొంత భాగాన్ని తీసుకోవచ్చు.
-ఫణి

Post a Comment

0 Comments

Close Menu