Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, May 9, 2012

లైనక్స్‌ టెక్నికల్‌ వర్డ్స్‌



కెర్నెల్‌
లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో కెర్నెల్‌ అనేది కీలకమైనది. హార్డ్‌వేర్‌తో సంభాషిస్తూ మన పనులకు చేసిపెడుతుంది. కంప్యూటర్‌ బూట్‌కాగానే కెర్నెల్‌ మెమరీలోకి లోడ్‌ అవుతుంది.
షెల్‌
కంప్యూటర్‌కి, యూజర్‌కి అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది.
ఇన్‌ఫుట్‌, ఔట్‌ఫుట్‌ రీ డైరెక్షన్‌
ఒక ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్‌ చేసి ఫలితాన్ని స్క్రీన్‌పై చూడవచ్చు. అలా కాకుండా ఒక ఫైల్‌ ఔట్‌ఫుట్‌ని మరొక ఫైల్‌ ఇన్‌ఫుట్‌గా పంపడం లేదా ఔట్‌ఫుట్‌ని ఫైల్‌ రూపంలో స్టోర్‌ చేయడం కూడా చేయవచ్చు. ఫలితాన్ని తెరపై చూడకుండా నేరుగా ఫైల్‌లో రాయవచ్చునన్నమాట. ఇలా చేయడాన్ని రీ డైరెక్షన్‌ చేయడమని అంటారు. ఏక కాలంలో ఇన్‌ఫుట్‌ని, ఔట్‌పుట్‌ని కూడా రీ డైరెక్షన్‌ చేయవచ్చు.
పైప్స్‌
సులభమైన, చిన్నపాటి ప్రోగ్రామ్‌లు వ్రాసి క్లిష్టమైన పనులు చేయమని చెప్పేవే పైప్స్‌. ప్రోగ్రామింగ్‌ పనుల్ని సులభతరం చేస్తాయి.
వైల్‌కార్డ్‌ పాటర్న్స్‌
డాస్‌ కమాండ్స్‌లో వాడే లి,? వంటి గుర్తులతో వాడే వైల్డ్‌కార్డులు.
షెల్‌ స్క్రిప్ట్స్‌
కొన్ని కమాండ్‌లను వెంట వెంటనే వాడాలసినప్పుడు కమాండ్‌ ప్రామ్ట్‌ వద్ద ఒక్కొక్కటి ఇవ్వకుండా, మనకు కావలసిన వరుసలో టైప్‌ చేసి ప్రామ్ట్‌వద్ద ఫైల్‌ పేరు ఇస్తే, ఒకదాని తరువాత ఒకటి ఎగ్జిక్యూట్‌ అవుతాయి. ఫైల్‌కి ఎగ్జిక్యూషన్‌ పర్మిషన్‌ లేకపోతే రష్ట్ర దళశ్రీవఅaఎవగ అని ఇవ్వాల్సి వుంటుంది.
షెల్‌ వేరియబుల్స్‌
డేటాని వేరియబుల్స్‌ రూపంలో వుంచి షెల్‌ ప్రవర్తనను నియంత్రిచేవి. అందరూ వాడే షెల్‌ని బాష్‌ అంటారు.
లాగిన్‌, లాగౌట్‌
సిస్టమ్‌లోకి వెళ్లడాన్ని లాగిన్‌ అని వెనక్కి రావడాన్ని లాగౌట్‌ అని అంటారు.
ఓపెన్‌ సోర్సెస్‌
బైనరీ ఫైల్స్‌ కాకుండా సోర్స్‌ కోడ్‌లో ఇవ్వడం. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ అనే దానికి మారు పేరు ఓపెన్‌ సోర్సెస్‌.
ప్యాకేజీస్‌
సాఫ్ట్‌వేర్‌లనే ప్యాకేజీస్‌ అంటారు.

Saturday, May 5, 2012

లినక్స్ లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయటం ఎలా?

టపాలో, ఉబుంటు లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ చెయ్యాలో వ్రాయటం జరిగింది, ఇది మరి కొన్ని gnome లినక్సులకు కూడా వర్తించవచ్చు.


టెర్మినల్ తెరవటానికి, Alt+F2 నొక్కి gnome-terminal అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలు.

టెర్మినల్ లో sudo pppoeconfఅని టైప్ చేసి ఎంటర్ నొక్కితే అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్ కోసం అడుగుతుంది, పాస్‌వర్డ్ ఇవ్వగానే ఎస్ ఆర్ నోఅని అడుగుతుంది, ఇలాకనిపించిన ప్రతి సారీ ఎంటర్ నొక్కటామే మనం చెయ్యవలసినది.

http://www.techotopia.com/images/1/12/Ubuntu_linux_ppoeconf.jpg

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్


కాసేపు ఉన్న అవకాశాల కోసం స్క్యాన్ చేస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ username password అడుగుతుంది. అవి ఇవ్వటం ఎంటర్ నొక్కటం, ఇదే మనం చెయ్యవలసింది. ఇలా మొదటి సారి చేశాక, మీరు కంప్యూటర్ ఆన్ చేసిన ప్రతి సారీ దానంతటదే ఇంటెర్నెట్‌కు కనెక్ట్ ఐపోతుంది.

కనెక్ట్ అయ్యిందో లేదో చూడటానికి Firefox తెరిచి ఏదైనా వెబ్సైట్ వెళ్ళటానికి ప్రయత్నించి చూడండి.

Thursday, May 3, 2012

ఊరిస్తున్న విండోస్‌7 ఐపాడ్‌ మీద సాధ్యమేనా?



ప్రపంచంలోనే అత్యధిక జనాదరణ పొందిన సాఫ్ట్‌వేర్‌లలో విండోస్‌7 అగ్రగామి. 2009 అక్టోబరు 22న అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ దీన్ని విడుదల చేసింది. దీనికి ముందుగా జారీ చేసిన విస్తా కన్నా విండోస్‌7లో అధిక ఫీచర్లు ఉండటం జనాదరణకు పాత్రమైంది. అయితే ఐపాడ్‌ లేదా ఐఫోన్‌ మీద ఈ అప్లికేషనును నేరుగా ఉపయోగించడం సాధ్యం కాదని తెలుసుకుంటే నిరుత్సాహం కలుగక మానదు. అనేక రకాల ఉపయోగాలను ఒకే తావులో అందించడమే
విండోస్‌7 ప్రత్యేకతగా ఒక్కమాటలో చెప్పుకోవచ్చు. అయితే 2012 తొలి నాళ్లలో యాపిల్‌ ఐఓస్‌ వాతావరణంలో ఉపయోగించుకునేందుకు వీలుగా విండోస్‌ను మైక్రోసాఫ్ట విడుదల చేసింది. అయితే యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీల నడుమ తెరవెనుక కుదిరిన చీకటి ఒప్పందం ఏమిటనేది మాత్రం బయటకు పొక్కలేదు. బలీయమైన ఆర్దిక వనరులను సంతరించుకున్న యాపిల్‌ పరిణామ ప్రక్రియలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ నాణ్యతను సొంతం చేసుకున్నా ఆశ్యర్య పడాల్సింది లేదు.

Popular Posts