Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, June 29, 2012

వెబ్‌సైట్లకు, బ్లాగ్‌ల ర్యాంకు లిచ్చే అలెక్సా






టివిలకు  రేటింగ్ ఇచ్చే ప్రక్రియ లాగానే వెబ్సైట్లు, బ్లాగ్ల కూడా ర్యాకింగ్ ఇస్తారు. ర్యాకింగ్ ఆధారంగా యాడ్స్ వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వెబ్సైట్లకు  ర్యాంక్లను ఇవ్వడానికి 1996 ఏప్రిల్లో అలెక్సా ఈ ప్రక్రియకు  శ్రీకారం చుట్టింది. ఇది రోజూ 1.7 టెరాబైట్ల సమాచారాని  చూస్తుంది. ఒక కోటి అరవైలక్షల సైట్ల నుండి దరిదాపు 500 కోట్ల వెబ్ పేజీలను అధ్యయనం చేసి వాటి ఆదరణ ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో పెడుతుంది. ఈ పఁచేయడానికి అలెక్సా కొరిన ప్రత్యేకమైన, సమర్థవంతమైన ప్రోగ్రామ్లను రూపొందించుకు0ది. వెబ్ ర్యాకింగ్ అనేది రెండు విషయాల
Add caption
ఆధారంగా అలెక్సా రూపొందిస్తుంది. ఒక వెబ్సైట్ను ఎంతమంది సందర్శిస్తారు? అనేది మొదటి విషయం. దీనినే రీచ్ (Reach) అంటార

రెండవ అంశం ఏ సైట్లో ఎనీ పేజీలను పాఠకులు చూస్తున్నారనేది. దీనినే పేజీ వ్యూస్  (Page Views)  ) అంటారు.
మనము ఒక సైట్ను చూడగాకి దానిమీద అవగాహన కలుగుతుంది. ఇంర్నెట్లో దాఁకఁన్న స్థానమెమిటో ర్యాకింగ్ను చూస్తేగానీ తెలియదు. ఈ ర్యాకింగ్ను ఐదు స్టార్లలో సూచిస్తుంది. దీనిబట్టి సైట్ల మంచి చెడ్డలు తెలుస్తాయి. గ్రాఫ్ద్వారా ర్యాంకింగ్ను ఇవ్వడం అలెక్సా ప్రత్యేకత. ఒక సైట్ను ఏఏ దేశాలలో ఎంతమంది వీక్షిస్తుంది తెలియజేస్తుంది. మీరు చూసే సైట్ల ర్యాంకింగ్ తెలుసుకోవాలంటే షషష. www.alexa.com చూడండి.

Thursday, June 28, 2012

లినక్స్ గూర్చి తెలుసుకో....?



లక్ష్యం:

దేని గురించైనా తెలుసుకోవాలంటే దాని ఆకారం లేదా ప్రవర్తన గూర్చి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అలాగే లినక్స్ గూర్చి తెలుసుకోవటానికి దాని డైరెక్టరీ క్రమం గూర్చి తెలుసుకోవటం ఉపయోగకరం. అందులోనూ లినక్స్ కు మరియు విండోస్ కు, వాటి వాటి పొందికలలో చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలకు సంబందించిన దాఖలాలు ఉంటాయో ఈ టపాలో తెలుసుకొందాం.

విండోస్ లో ఏదైనా ఫైల్ ఉన్న దారి సూచించాలంటే క్రింద తెలిపిన విధంగా వాడతాము.



c:\folder\subfolder\file.txt



అదే లినక్స్ లో అయితే ఇలా వాడతాము



/folder/subfolder/file.txt



ఇక్కడ గమనిస్తే, విండోస్ లో వాడిన స్లాష్ గుర్తు వెనక్కు వాలినదై ఉంది(back slash). అదే లినక్స్ లో ఐతే ముందుకు వాలినదై ఉంటుంది.



అలాగే విండోస్ లో లాగా లినక్స్ లో సీ మరియు డీ డ్రైవ్ ల లాంటివి కనపడవు. ఎందువలనంటే లినక్స్ లో ప్రతి ఒక్క డ్రైవ్ లేదా ఫైల్ లేదా ఏ డివైస్ అయినా కాని ఒకే ఒక పార్టిషన్ క్రింద ఉన్న డైరెక్టరీలలో ఎక్కుపెట్టబడి ఉంటాయి. దాని పేరు రూట్ పార్టిషన్. దానిని / గుర్తుతో సూచిస్తారు. పైన తెలిపిన వాడుకను గమనిస్తే ఆ దారిలో మొదటి గుర్తు / గా ఉంది.



విండోస్ కు మరియు లినక్స్ కు మరో తేడా ఉంది. విండోస్ లో దారి సూచించేటప్పుడు పెద్ద C కు మరియు చిన్న c కు తేడా లేదు. అందుకే c:\folder\subfolder\file.txt మరియు C:\FOLDER\subfolder\file.txt విండోస్ లో ఒక్కటే. కానీ లినక్సులో /folder/subfolder/file.txt మరియూ /FOLDER/subfolder/file.txt ఒకటి కాదు.


లినక్సులో మనం తెలుసుకోవలసిన డైరెక్టరీల పట్టీ ఇది:



/bin/ - బిన్

/dev/ - డెవ్

/etc/ - ఈ.టి.సీ.

/home/ - హోం

/lib/ - లిబ్

/media/ - మీడియా

/root/ - రూట్

/sbin/ - ఎస్ బిన్

/tmp/ - టెంప్

/var/ - వ్యార్



డైరెక్టరీ అందులో ఏం ఉంటాయి?

బిన్ (bin) ఇందులో ప్రతి యూజర్ వాడుకోగలిగే అన్ని ప్రోగ్రాంలు ఉంటాయి. అన్నీ బైనరీ ఫైళ్ళే. అందుకే దీని పేరు bin(ary). ఉదాహరణకి : cat, ls, cp ప్రోగ్రాంలు ఇందులోనే ఉంటాయి.

డెవ్ (dev) ఇందులో హార్డ్ డిస్కులు, మోడెం లు , సౌండ్ కార్డ్ లాంటి అన్ని పరికరాలని(devices) సూచించే ఫైల్లు ఉంటాయి.

ఇటిసి (etc) ఇందులో టెల్ నెట్, ఎస్ ఎస్ హెచ్, ఎస్.యమ.టి.పి/పాప్౩ లాంటివాటి సెట్టింగులు ఉంటాయి. DSN సెట్టింగుల లాంటివి ఇందులో ఉన్న ఫైల్ లలో నే ఉంటాయి.

హోం (home) ప్రతి యూజర్ ఎకౌంటు కు ఒక డైరెక్టరీ ఇందులో ఉంటుంది. మీరు లాగిన్ అయినప్పుడు మీకు కనపడే డెస్క్టాపు కుడా ఈ డైరెక్టరి లోని భాగమే. దిని యొక్క చిరునామా - /home/username/Desktop టెర్మినల్ ద్వారా లాగిన్ ఐతే ఆ యూజర్ యొక్క హోం డైరెక్టరీ లోనికి తిసుకేలుతుంది. /home/username ఈ డైరెక్టరీ ని మార్చాలంటే ఈ.టి.సీ లో ఉన్న ఫైల్ ను ఒకదానిని మార్చాలి.

రూట్ (root) లినక్స్ లో సర్వాధికారాలు కలిగిన వాడుకరి పేరు రూట్. ఈ వాడుకరికి తన హోం డైరెక్టరి /home లో ఇవ్వటానికి బదులు /root గా ఇవ్వబడుతుంది

లిబ్ (lib) ఇందులో కెర్నెల్ మాడ్యుళ్ళు మరియూ కంప్యుటర్ భాష లకు (పెర్ల్, పైతాన్, సీ మొ

) సంభందించిన లైబ్రరీలు(libraries) ఉంటాయి

మీడియా (media) ఇందులో హార్డ్ డిస్క్ డ్రైవ్ లు, సీ.డీ.డ్రైవ్ లు, పెన్ డ్రైవ్ లు లాంటివి ఎక్కుపెట్టబడి ఉంటాయి. విండోస్ లో మై-కంప్యుటర్ లో కనిపించినవన్నమాట.

ఎస్.బిన్ (sbin) సిస్టం ప్రోగ్రాంలు ఇక్కడ ఉంచబడుతాయి(secure binary files అన్నమాట.). పార్టిషన్ లు తయారు చేయటం, నెట్వర్క్ పరికరాలు లాంటివి. సాధారణ వాడుకరులకు ఇవి అందుబాటులో ఉండవు.

టెంప్ (tmp) తాత్కాలికంగా(temporary) ఏదైనా ఫైల్ ను భద్రపరచాలంటే ఈ డైరెక్టరీ ని వాడుతారు. యుట్యూబ్ లో విడియో లు చూస్తున్న సమయము లో, ఈ డైరెక్టరీ లో ఆ విడియో ఫైల్ ఉంటుంది. అలాగే ఏదైనా ఇంస్టాల్ చేస్తున్నప్పుడు తాత్కాలింకంగా కావలసిన ఫైళ్ళను ఇక్కడ ఉంచుతుంది.

వ్యార్ (var) డేటా బేసులు, సర్వర్లు, లాగ్ ఫైల్లు, సిస్టం యొక్క మెయిల్ మెసేజ్ లు ఇక్కడుంటాయి. అలాగే ఇంస్టాల్ చేసిన కొన్ని సాఫ్ట్వేర్ ల యొక్క బైనరీ ఫైల్లు కూడా ఇందులో ఉంటాయి

Sunday, June 24, 2012

కంప్యూటర్ అంటే ఏమిటి?


కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలి. కానీ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.

  • కన్సైజ్ఆక్స్ర్డు ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్ను "ముందుగా నిర్ధరించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. నిర్వచనం కంప్యూటర్ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.
  • వెబ్స్టర్స్ ఆంగ్ల డిక్షనరి కంప్యూటర్కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానికి పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.
  • సురేశ్బసంద్ర తన కంప్యూటర్స్ టుడే అనే పుస్తకంలో పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానంచేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం." అని నిర్వచించారు. నిర్వచనంలో కంప్యూటర్ను 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది

Saturday, June 23, 2012

ఊరిస్తున్న విండోస్‌7 ఐపాడ్‌ మీద సాధ్యమేనా?



ప్రపంచంలోనే అత్యధిక జనాదరణ పొందిన సాఫ్ట్వేర్లలో విండోస్‌7 అగ్రగామి. 2009 అక్టోబరు 22 అంతర్జాతీయ సాఫ్ట్వేర్దిగ్గజం మైక్రోసాప్ట్దీన్ని విడుదల చేసింది. దీనికి ముందుగా జారీ చేసిన విస్తా కన్నా విండోస్‌7లో అధిక ఫీచర్లు ఉండటం జనాదరణకు పాత్రమైంది. అయితే ఐపాడ్లేదా ఐఫోన్మీద అప్లికేషనును నేరుగా ఉపయోగించడం సాధ్యం కాదని తెలుసుకుంటే నిరుత్సాహం కలుగక మానదు. అనేక రకాల ఉపయోగాలను ఒకే తావులో అందించడమే
విండోస్‌7 ప్రత్యేకతగా ఒక్కమాటలో చెప్పుకోవచ్చు. అయితే 2012 తొలి నాళ్లలో యాపిల్ఐఓస్వాతావరణంలో ఉపయోగించుకునేందుకు వీలుగా విండోస్ను మైక్రోసాఫ్ట విడుదల చేసింది. అయితే యాపిల్‌, మైక్రోసాఫ్ట్కంపెనీల నడుమ తెరవెనుక కుదిరిన చీకటి ఒప్పందం ఏమిటనేది మాత్రం బయటకు పొక్కలేదు. బలీయమైన ఆర్దిక వనరులను సంతరించుకున్న యాపిల్పరిణామ ప్రక్రియలో భాగంగా మైక్రోసాఫ్ట్నాణ్యతను సొంతం చేసుకున్నా ఆశ్యర్య పడాల్సింది లేదు.

Thursday, June 21, 2012

లినక్సు వాడేవాళ్ళు అదృష్టవంతులు........



లిక్సు వాడేవాళ్ళు చాలా విధాలుగా అదృష్టవంతులు. ఈ మాటని దృవీకరిస్తూ ఎన్ని నిజాలు వెలుగులోకి వచ్చినా, మల్టీ మీడియా రంగం లో లినక్సు మీద పడిన

"ఎహే, ఆ ఫైల్ లినక్సులో ఆడదురా!" అన్న మచ్చ చెరగడానికి మటుకు చాలా సమయం పట్టింది. పాపం, నిజానికి నిజం ఏంటంటే, మొద

ట్నుంచి లినక్సు కేకే! కాకపోతే,

వాడకం కష్టమై ఆ మచ్చ అలానే ఉండి పోయింది. కాని ఇప్పుడది కాదు పరిస్థితి. ఈ టపాలో లినక్సులో ఇప్పటి ఆడియో ప్లేయర్ల పరిస్థితి సమీక్షిద్దాం.

మీడియా ప్లేయర్ లో మనం ముఖ్యంగా చూసే ఫీచర్లు

మల్టిమీడియా కీబోర్డు షార్ట్ కట్లు పని చేయడం.


రకరకాల మీడియా ఫైళ్లను సులువుగా ప్లే చేయడం

పెద్ద పెద్ద లైబ్రరీలను అవలీలగా ఆపసోపాలు పడకుండా హేండిల్ చేయడం

మీడియా ఫైళ్ళను టాగ్ చేయడం

మామూలు & డైనమిక్ ప్లే-లిస్ట్లను సృష్టించుకోవడం.

ఆడియో స్క్రాబ్లర్ తో అనుసంధానం ఉండటం.

ట్రేలో పడుండి పనికి అడ్డురాకుండా ఉండటం.

సౌకర్యాలు ఉన్న ప్లేయర్లు ఏంటో చూసి, ఏ ప్లేయర్ ఏయే పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుందో కూడా చూద్దాం.

Friday, June 8, 2012

హార్డ్‌వేర్‌ హార్డ్‌వేర్‌ ...

డ్రైవర్స్‌
ఏదైనా ఒక ఉపకరణం కంప్యూటర్‌ సంబంధాన్ని ఏర్పరుచుకొని డేటాని ట్రాన్స్‌ఫర్‌ బదిలీ చేసే సాఫ్ట్‌వేర్‌.
యుఎస్‌బి
యూనివర్షల్‌ సీరియల్‌ బస్‌ (యుఎస్‌బి) పిసికి ఇతర ఉపకరణాలను కలుపుకొనేందుకు వీలు కల్పించేందుకు ఫోర్ట్‌.
స్పామ్‌
స్పామ్‌ని చెత్త అని కూడా అనవచ్చు. అంటే మనకు పనికిరాని సంక్షిప్త సమాచారాన్ని పంపేది.
రిజిస్ట్రీ
విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యే ప్రతీ సాఫ్ట్‌వేర్‌ లేదా హార్డ్‌వేర్‌ సమాచారాన్ని కలిగివుండే దానిని రిజిస్ట్రీ (డేటాబేస్‌) అంటారు.
పైర్‌వేర్‌
డిజిటల్‌ కెమెరా, రికార్డర్లు మొదలగు ఉపకరణాలకు, పీసీలకు మధ్య సంబంధాన్ని ఏర్పరచి, వేగంగా డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వీలునిచ్చే సూపర్‌ఫాస్ట్‌ డేటా లింక్‌.
స్పైవేర్‌
ఏదైనా సాఫ్ట్‌వేర్‌ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు దానితోపాటు ఇది కూడా మనకు తెలియకుండా ఇన్‌స్టాల్‌ అయి ఆ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు మన సమాచారాన్ని తెలియజేసేది.
ఫర్మ్‌వేర్‌
హార్డ్‌వేర్‌ తయారుచేసే వారు దానికి సంబంధించిన సూచనలను రోమ్‌ మెమెరీలో వుంచి పనిచేసేటట్లు చేయడానికి ఫర్మ్‌వేర్‌ అంటారు.
సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌
సిస్టమ్‌ను పనిచేయించడానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ అంటారు.
అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌
సిస్టమ్‌లోని అప్లికేషన్స్‌ను పనిచేయించడానికి వాడేదే అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌.
హార్డ్‌వేర్‌
సిస్టమ్‌లోని భాగాలు మదర్‌బోర్డు, ప్రాసెసర్‌, హార్డ్‌డిస్క్‌, కీబోర్డు, మౌస్‌ మొదలగువాటిని హార్డ్‌వేర్‌ అంటారు.

Popular Posts