Ad Code

ఒక రూపాయికే ప్రపంచవ్యాప్తంగా ఫోన్‌ మాట్లాడుకోవచ్చు


ఎమ్‌టిఎన్‌ఎల్‌ (మహానగర్‌ టెలికం నిగమ్‌ లిమిటెడ్‌) ఢిల్లీ, ముంబయిల్లో కేవలం ఒక్క రూపాయికే విదేశాలకు ఫోన్‌ చేసుకునే సౌలభ్యం కలగజేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఒక్క రూపాయి ఫోన్‌ చేయదలచిన వారు వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోట్రోకాల్‌ సర్వీస్‌ (విఓఐపి) ద్వారా ఫోన్‌ చేసుకొని ఐఎస్‌డి బిల్లును తగ్గించుకోవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీస్‌ ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో మీరు ఎంత సేపైనా తనివితీరా మాట్లాడుకుంటూ ఉండవచ్చు. దీని వల్ల మీ టెలిఫోన్‌ బిల్లు పెరిగి పోతుందనే బెంగ ఉండదు. ఇలా ఒక రూపాయికే ప్రపంచవ్యాప్తంగా 150దేశాలకు మాట్లాడుకునే సౌలభ్యం ఎమ్‌టిఎన్‌ఎల్‌ కలుగజేస్తోంది. ప్రత్యేకించి ఇలా అమెరికా, ఇంగ్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియాలకు ఫోన్‌ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ ఫోన్‌ చేయాలంటే మీ ఇంట్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న కంప్యూటర్‌, లేదా ఐపిడి (ఇంటర్నెట్‌ ప్రోట్రోకాల్‌ డివైజ్‌) పరికరం ఉండాలి. మీ ఫోన్‌ను వాటితో అనుసంధానిస్తే చాలు. ఇక ఎంచక్కా మీరు ఒక రూపాయికే ఐఎస్‌డి చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu