ఆంగ్ల భాషలోను, అను లాంటి యూనీకోడేతర ఫాంట్లను చెయ్యవచ్చు

ఈ ఉపకరణం గురించి:

ఇది Unigateway ప్రాజెక్టులోని కొన్ని ముఖ్య ఫైళ్లను ఉపయోగిస్తూ, మరికొంత సంకేతికత కలిపి తయారు చెయ్యబడింది.

Unigateway అనేది మొజిల్లా Padma ప్లగిన్ నుండి స్ఫూర్తిపొంది PHPలో రాయబడిన ఉపకరణాల సమాహారం. 

 మీ టెక్స్ట్ ఫైలు యూనీకోడులోకి సరిగ్గా మారకపోతే; రెండు కారణాలు ఉండవచ్చు
1) టైపు చేసిన వెర్షను ఒకటి; ఇక్కడ మారుస్తున్నప్పుడు ఎంచుకున్న వెర్షను మరొకటి అయ్యుండొచ్చు
2) అనేతర ఫాంట్లలో టైపు చేసి ఉండొచ్చు

 సాదారణంగా వర్డు, పేజ్‌మేకరు లాంటి సాఫ్ట్‌వేర్‌లలో ఒకటికన్నా ఎక్కువ ఫాంట్లను ఉపయోగించవచ్చు. ఆంగ్ల భాషలోను, అను లాంటి యూనీకోడేతర ప్రొప్రైటరీ ఫాంట్లను ఉపయోగిస్తూ అంగ్లేతర భాషలలోనూ కలిపి ఒకే ఫైలులో టైపు చెయ్యవచ్చు. కానీ నోట్‌పేడ్‌ లాంటి టెక్స్ట్ ఎడిటర్‌లలో ఒక ఫైలులో ఒక్క ఫాంటుని ఉపయోగించి మాత్రమే టైపు చెయ్యగలం. కాబట్టి వర్డు, పేజ్‌మేకరు లలో టైప్ చేసిన టెక్స్ట్‌ని నోట్‌పేడ్‌లోకి కాపీ చేసినట్టయితే, అప్పుడు ఎంచుకున్న ఫాంటులో ఉన్న టెక్స్ట్ మాత్రమే సరిగ్గా కనబడుతుంది. మిగిలిన ఫాంట్లలో ఉన్న అక్షరాలు, ఎంచుకున్న ఫాంటులోకి రూపాంతరం చెంది అర్థం కావు. 


Post a Comment

0 Comments