Ad Code

వైఫీ టెక్నాలజీ నుంచి ప్రజల్లో అవగామన


ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. అందులోనూ పాశ్చాత్య దేశాల్లో టెక్నాలజీ వినియోగం మీద ప్రతి ఒక్కరికీ అమితాసక్తి. అయితే ఇటీవల పలు ఆర్గనైజేషన్లు వెల్లడించిన నివేదికల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో క్యాన్సర్స్‌, ట్యూమర్స్‌ వంటివి రావటానికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాల్లో ప్రజలు జీవన విధానంలోకి చొచ్చుకు వస్తున్న టెక్నాలజీయే కారణంగా తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...అందరూ ఎంతగానో తక్కువ ఖర్చుతో ఎంతో మందికి ఉపయోగపడే వైఫీ టెక్నాలజీ దీనికి ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్న విషయం తెలిసి అవాక్కవటం అక్కడివారి వంతు అయింది. ఎందువల్ల అంటే ఈ వైఫీ టెక్నాలజీ నుంచి ప్రసారమయ్యే అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేడియో తరంగాల నుంచి వెలువడే రేడియోషన్‌ ద్వారా వ్యాధులు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది. వ్యాధుల సంగతి అటుఉంచితే, వ్యక్తిగత జీవితంలోకి ఈ టెక్నాలజీ ఆధారంగా చేసుకొని నిఘా సంస్థలు చొరబడి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి కూడా.
ఇప్పటికే దీనిపై అమెరికాలో విసృతమైన చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి, నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీ గురించి ప్రజల్లో అవగామన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రేడియేషన్‌ ఎంత ఉండాలి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అసలీ రేడియేషన్‌ ఎలా ఏర్పడుతుంది. దీనివల్ల కలిగే దుష్పలితాలను ఇతర మార్గాల ద్వారా ప్రచార
మాధ్యమంలోకి రావటంతో దీనిపై చర్చ ప్రారంభమైంది. ఇంటి మీద, ఇంటి చుట్టుపక్కల ఇలాంటి టవర్లు ఉండటం వల్ల పసివారిపై రేడియోషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఈ వైఫీ వ్యవస్థ వల్ల నగరాల్లో నివసించే వారు తొందరగా దీని ప్రభావినికి గురి అవుతారని తాజా అధ్యయనాలలో వెల్లడైంది. సో...టెక్నాలజీతో పాటు అనారోగ్యాలను 'కొని'తెచ్చుకుంటున్నాము. అవసరాలే మనల్ని వాటికి బానిసలు ఎలా చేస్తాయో, వాటిని ఎంతమేర వినియోగించాలి, అసలు అవసరమా, లేదా, దానికన్నా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లేవా అనేవాటిని ప్రశ్నించుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu