Ad Code

మైక్రోసాఫ్ట్ విండోస్ 11

మైక్రో సాఫ్ట్ తన విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఎన్నో కొత్త ఫీచర్లను అందించింది. విండోస్ 10 వినియోగదారులకు ఉచితంగా ఈ అప్‌డేట్‌ను అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.




మైక్రోసాఫ్ట్ తన తర్వాతి తరం విండోస్ ఆపరేటింగ్ సిస్టంనే తీసుకువచ్చింది. అదే విండోస్ 11. ఒక వర్చువల్ ఈవెంట్‌లో మైక్రోసాఫ్ట్ దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా మైక్రోసాఫ్ట్ తన డిజైన్ లాంగ్వేజ్‌ను సులభతరం చేసింది. దీంతో విండోస్ 11 చాలా మోడ్రన్‌గా ఫ్రెష్‌లుక్‌తో కనిపిస్తుంది.

ఇందులో స్నాప్ లేఅవుట్స్, స్నాప్ గ్రూప్స్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం డెస్క్‌టాప్‌ను కూడా కొత్త తరహాలో డిజైన్ చేసింది. మన  వర్క్ ప్రిఫరెన్సెస్ ప్రకారం వేర్వేరు డెస్క్‌టాప్‌లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మాక్ఓఎస్, క్రోమ్ఓఎస్‌లకు పోటీని ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని మార్పులను తీసుకువచ్చింది. స్టార్ట్ మెనూ గతంలో లాగా ఎడమ వైపు నుంచి కాకుండా మధ్యలో ఉండనుంది. విండోస్ 10లో ఉండే లైవ్ టైల్స్‌ను ఇందులో తీసేశారు. ఇందులో అలెర్ట్స్, నోటిఫికేషన్లకు ప్రత్యేకమైన సౌండ్లు అందించనున్నారు. కొత్త థీమ్స్, కొత్త వాల్ పేపర్స్, మెరుగైన డార్క్‌మోడ్‌ను ఇందులో అందించారు. వీటిలో విడ్జెట్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అప్‌డేట్ చేశారు.

విండోస్ 11లో మెరుగైన టచ్ కీబోర్డు కూడా ఉంది. జిఫ్ ఫీచర్‌ను కూడా అందించారు. దీంతోపాటు వాయిస్ డిక్టేషన్, వాయిస్ కమాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఇందులో టచ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ఎన్‌హేన్స్ చేసింది. విండోస్ 10లో టచ్ కమాండ్స్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వీటిని ఇందులో మెరుగు పరిచారు.

దీంతోపాటు టీమ్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలను డీఫాల్ట్‌గా అందిస్తున్నారు. దీంతో ఇందులో మ్యూట్ అండ్ అన్‌మ్యూట్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఎడ్జ్ బ్రౌజర్‌కు కూడా ఇందులో పలుమార్పులు చేశారు. గేమర్ల కోసం పలు ఫీచర్లను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆటో హెచ్‌డీఆర్ సపోర్ట్, డైరెక్ట్ఎక్స్ 12 అల్టిమేట్, ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్‌లు ఇందులో ఉన్నాయి. క్లౌడ్ గేమింగ్, ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ యాక్సెస్‌ను ఎక్స్‌క్లౌడ్ ఇంటిగ్రేషన్ ద్వారా పొందవచ్చు. మైక్రోసాఫ్ట్ స్టోర్‌ను కూడా ఇందులో మెరుగుపరిచారు. సెర్చ్ సామర్థ్యాన్ని పెంపొందించడమే, డిజైన్‌కు కూడా మెరుగులు దిద్దారు. దీంతోపాటు డెవలపర్ల కోసం జీరో రెవిన్యూ షేర్ పద్ధతిని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఉండే యాప్స్‌కు వచ్చే రెవిన్యూ నుంచి కంపెనీ ఒక్క రూపాయి కూడా తీసుకోదన్న మాట. ఇది జులై 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కోసం అమెజాన్ యాప్ స్టోర్‌ను కూడా మైక్రోసాఫ్ట్ ఇందులో ఇంటిగ్రేట్ చేయనుంది. ఇందుకోసం ఇంటెల్ బ్రిడ్జ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. మొబైల్ డివైస్‌లపై మెరుగైన బ్యాటరీని అందించనున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. 


Post a Comment

0 Comments

Close Menu