Ad Code

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా ?


ప్రస్తుతం అత్యధిక మంది వాడుతున్న బ్రౌజర్ ఏదైనా ఉందంటే అది గూగుల్ క్రోమ్ అని చెప్పుకోవచ్చు. మొజిల్లా, ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లాంటి ఎన్ని బ్రౌజర్లు ఉన్నా గూగుల్ క్రోమ్ వైపే చాలామంది మొగ్గు చూపుతారు. ఇందుకు దీని వేగంతో పాటు మరికొన్ని ఫీచర్లు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. కానీ తాజాగా గూగుల్ క్రోమ్‌లో ఓ లోపం బయట పడింది. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని కూడా మన ఫోన్ లేదా ల్యాప్ టాప్ లలోని సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సంస్థే వెల్లడించింది. అయితే దీన్ని నివారించేందుకు ఉన్న మార్గాన్ని కూడా వెల్లడించింది ఆ సంస్థ. ఇందుకోసం యూజర్లు తమ డివైజ్‌లలో క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ లోపాన్ని కవర్ చేయవచ్చని గూగుల్ చెబుతోంది. ఈ సెక్యూరిటీ లోపం ద్వారా హ్యాకర్లు మన డివైజ్ ని తమ కంట్రోల్లోకి తీసుకోవడంతో పాటు మన డేటాను మొత్తం ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ముందే గుర్తించి గూగుల్ ఈ లోపాన్ని సవరించింది. అందుకే యూజర్లు వీలైనంత తొందరగా తమ యాప్ లేదా బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్ డేట్ అవ్వాలని వెల్లడిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu