Ad Code

రోబోలు కట్టిన బ్రిడ్జ్... !

 

ఇప్పటికే 3డీలో ప్రింటింగ్‌ చేసిన పలు వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ఈ జాబితాలోకి నెదర్లాండ్స్‌లోని ఓ స్టీల్‌ బ్రిడ్జ్‌ కూడా చేరింది. ప్రపంచంలోని మొట్టమొదటి 3 డీ ప్రింటెడ్ స్టీల్‌ వంతెన ఇదే కాగా ఈ వంతెనను 4 రోబోలు కలిసి నిర్మించడం మరో విశేషం. అమెస్టర్‌డామ్‌లోని అతి పురాతన కాలువపై నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగా పర్యాటక స్థలంగా ఆకర్షిస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దాదాపు 4,500 కిలోల ఉక్కును ఉపయోగించగా.. నెదర్లాండ్స్‌కు చెందిన ఎంఎక్స్ 3 డీ సంస్థ దీనిని జూలై 15న ప్రారంభించి జూలై 18న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 మీటర్ల పొడవైన ఈ వంతెనను ఒకచోట తయారు చేసి తీసుకొచ్చి పెట్టారు. ఆ తయారీలో సుమారు 6 నెలల పాటు కష్టపడి బ్రిడ్జిని రోబోలు రూపొందించాయి. తయారైన బ్రిడ్జిని పడవ సహాయంతో కాలువ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం క్రేన్‌ సహాయంతో కాలువపై ఉంచి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి కాలువను దాటేందుకు ఎంతో ఉపయోగపడడంతో పాటు నగరంలో పర్యాటక ప్రాంతంగా కూడా ఆకర్షిస్తుంది. దీనిని నిర్మించిన సంస్థ ఈ వంతెనకు సంబంధించిన మొత్తం డేటా కంప్యూటర్‌లో భద్రపరచగా.. మరోసారి అటువంటి వంతెనను నిర్మించడం దీంతో సులభం అవుతుందని చెప్తుంది.ఇందులో డజనుకు పైగా సెన్సార్లు ఉండగా.. వంతెనకు ఏమైనా ప్రమాదం.. లేదా దెబ్బతింటే వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం వస్తుంది. ఎంత బలాన్నైయినా ఈ వంతెన మోస్తుంది. ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జితో భవిష్యత్‌లో 3డీ పరిజ్ఞానంతో పెద్ద భవంతులు నిర్మించేందుకు కంపెనీలకు ఓ ఉదాహరణ అవుతుందని దీనిని తయారీ సంస్థ ఎంఎక్స్ 3 డీ సంస్థ చెప్తుంది.

Post a Comment

0 Comments

Close Menu