Ad Code

ఆకట్టుకుంటున్న రోబో కెఫే... !


ప్రధాని మోదీ ప్రారంభించనున్న అహ్మదాబాద్ సైన్స్‌సెంటర్ బోలెడు వింతలను, ఆశ్చర్యాలను మనకు పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ప్రపంచస్థాయి సైన్స్ సెంటర్‌గా ఎదిగేందుకు దూసుకుపోతున్న ఈ సెంటర్ సరికొత్త హంగులతో సందర్శకులను ఆశ్చర్యపర్చనుంది. ఇక్కడి ఆక్వాటిక్ గ్యాలరీ, రోబోటిక్ గ్యాలరీ, నేచర్ పార్కులను ఈనెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. గుజరాత్ సైన్స్ సిటీ మాండేట్ ప్రకారం.. గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ సిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీన్ని ప్రభుత్వం నిర్వహించే సొసైటీగా రిజిస్టర్ చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్‌పటేల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. ఈ సైన్స్ సెంటర్‌ను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా పలు గ్యాలరీలు ప్రారంభోత్సవం జరుపుకోనున్నాయి. వాటిల్లో అందరికీ ఆసక్తి కలిగిస్తున్నది రోబో కేఫ్‌.

వండివార్చే రోబోలే ప్రధాన ఆకర్షణఅహ్మదాబాద్ సైన్స్ సిటీలో ఏర్పాటైన రోబో కెఫే మనల్ని ఆశ్చర్యపరచనుంది. ఇక్కడ రోబోలే వంట చేయడంతో పాటు సర్వ్‌ చేస్తాయి. ఈ రోబో చెఫ్‌లు వివిధ రకాల వంటకాలను తయారు చేయగలవు. మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రోబో వెయిటర్లు ఫలహారాలు అందిస్తాయి. మన దైనందిన జీవితం ఎంత వేగవంతంగా మారిపోయిందో చెప్పడానికి ఈ రోబో కెఫే ఒక ఉదాహరణగా నిలువనుంది.

వడోదరకు చెందిన క్యూబ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈ రోబోటిక్స్ గ్యాలరీని నిర్మించింది. వచ్చే ఐదేళ్లపాటు సంస్థ ఈ గ్యాలరీని నిర్వహించనుంది. దీని నిర్మాణం, నిర్వహణ కలిపి రూ .127 కోట్లు ఖర్చు అవుతుంది. మూడు అంతస్థులతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ట్రాక్ ఉండటం ఈ గ్యాలరీ ప్రత్యేకత. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రోబోలు తయారుచేసిన ఆహారపదార్థాలు లభిస్తాయి. అలాగే ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్లు ఉన్నాయి. ఇక ట్రాన్స్ఫార్మర్, వాల్-ఇ పిక్చర్స్‌లలోని రోబోలు, హ్యూమనాయిడ్ రోబో అయిన అసిమో, అలాగే కొన్ని పాప్ కల్చర్ రోబోలు ఇక్కడ దర్శనమిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu