Ad Code

వీటిని తెగ వెతికారు!


కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు ఆన్లైన్ వైపు మొగ్గుచూపారు. లాక్డౌన్తో బయటికి వెళ్తే పరిస్థితి లేకపోవడంతో ఎంటర్టైన్మెంట్ కోసం ఆన్లైన్ సాధనాలను ఉపయోగించుకున్నారు. మరోవైపు కరోనా కారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ భాగా పెరిగింది. తమ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి నిరంతరం ఫిట్‌గా ఉండటానికి ఏం చేయాలనే విషయాన్ని ప్రజలు ఆన్‌లైన్‌లో తెగ వెతికారని ఇన్‌మోబీ తాజా నివేదిక వెల్లడించింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ నేషనల్ కంపెనీ అయిన ఇన్‌మోబీ సెర్చ్ ఇన్ ఇండియా 2021 ట్రెండ్స్ రిపోర్ట్ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. అందులో నెటిజన్ల ఆన్‌లైన్ బిహేవియర్‌, వారి సెర్చింగ్ ఇంపార్టెన్స్ఆధారంగాఏప్రిల్ 2020 నుంచి జూన్ 2021మధ్య సమాచారాన్ని విశ్లేషించించి కొత్త విషయాలు బయటపెట్టింది. నెటిజన్లు తమ ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని, తమ శారీరక ధృఢత్వం కోసం ఏం చేయాలనిఎక్కువగా అన్వేషిస్తున్నారని తెలిపింది. అలాగే ఆర్థిక పెట్టుబడులు, వినోదం, ఈ-లెర్నింగ్ ల గురించి నెటిజన్లు బాగా వెతికారని ఈ నివేదిక వెల్లడించింది.

నెటిజన్ల తమ ఆర్థిక పెట్టుబడుల ప్రాధామ్యాలను స్థిరాస్థుల నుంచి ఆర్థిక సాధనాల వైపు మళ్ళించడం పెరిగిందని నివేదిక తేల్చి చెప్పింది. అలాగే డిజిటల్ ఛానల్స్ వినియోగించడానికి నెటిజన్లు ఎక్కవ మొగ్గచూపుతున్నట్టుగా పేర్కొంది. ఆస్తుల నిర్వహణకు సంబంధించిన సెర్చ్‌లు 13 రెట్లు పెరిగాయి. అలాగే డిజిటల్ పేమెంట్స్ కూడా 12శాతం పెరిగాయి. గడిచిన కొన్ని సంవత్సరాలలో డిజిటల్ కంటెంట్ వినియోగం ఎక్కువైంది. కరోనా మహమ్మారి కాలం దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది. ప్రజలు తమ కంప్యూటర్లు, మొబైల్స్‌, టాబ్లెట్ స్క్రీన్ ముందు చెప్పుకోదగిన సమయం గడిపేందుకు అవకాశం చిక్కింది. దీనివలన వివిధ బ్రాండ్లు తమ అసలైన వినియోగదారుల దగ్గరకు చేరేందుకు మార్గం సుగమమైంది.

నెటిజన్లు తమసెర్చింగ్ ఇంట్రెస్ట్ ద్వారా అడ్వర్ట్టైజింగ్ ఏజెన్సీలకు కొత్త దారులు తెరిచారని ఇన్‌మోబీలో మైక్రోసాఫ్ట్ ఎడ్వర్టైజింగ్ డైరక్టర్ రోహిత్ దోశీ అన్నారు. ఇక ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడం వలన తమ ఇళ్ళలో జరిగే ఫంక్షన్లకు కేక్ డెలీవరీలకు సంబంధించిన సెర్చ్‌లు కూడా 15 రెట్లు పెరిగినట్టు ఆయన తెలిపారు. బయటి ప్రపంచంలోని వినోదసాధనాలన్నీ షట్డౌన్ కావడంతో ప్రజలకు ఆన్‌లైన్ ఎంటర్టైన్‌మెంటే దిక్కయ్యింది. దీంతో వినోదం, సంగీతం కోసంచేసే సెర్చ్‌లు పెద్ద త్తున పెరిగినట్టుగా తేలింది.

ఇక మోస్ట్ పాపులర్ నెట్ ఫ్లిక్స్ సిరీస్ అనే కీవర్డ్‌తో ఆన్‌లైన్‌లో నెటిజన్లు సెర్చ్ చేయడం 28 రెట్లు పెరిగిందని,క్రికెట్ లైవ్‌కోసం వెతికేవారి సంఖ్య అయితే ఏకంగా 381 రెట్లు పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆన్‌లైన్ గేమ్‌ల కోసం సెర్చ్ చేసేవారి సంఖ్య 52 శాతం పెరిగిందని తెలిపింది. దీంతోపాటు ఈ లెర్నింగ్, విద్యా సంబంధిత సమాచారం కోసం వెతికేవారి సంఖ్య కూడా బాగా పెరిగిందని నివేదిక పేర్కొంది. లెర్నింగ్ ఆన్‌లైన్ కోసం వెతికే నెటిజన్లు 367శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. అలాగే విద్యా సంబంధిత శిక్షణలకోసం వెతికే నెటిజన్లుకూడా 103 శాతం పెరిగినట్లుగా నివేదిక స్పష్టం చేసింది.


Post a Comment

0 Comments

Close Menu