Ad Code

కారు మీద మెరుపు షాక్ !

 


అమెరికా, కాన్సాస్‌లోని వావర్లీ సమీపంలో  హైవే రోడ్డు మీద కారు వెళ్తుండగా దానిపై పిడుగు పడింది.  ఈ ఘటన జూన్‌ 25న చోటు చేసుకోగా,  కారులోని ముగ్గురు చిన్న వయసున్న పిల్లలు, ఇద్దరు పెద్ద వాళ్లు ఉన్నారు. మెరుపు దాడి వల్ల కారులో ఉన్నవాళ్లకు ఎలాంటి అపాయం జరగలేదు. ఉన్నట్టుండి కారు మీద పిడుగు పడటంతో కారులో ఉన్న వాళ్లు షాక్‌కు గురయ్యారు. తమకు ఎలాంటి హానీ జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆ కారు వెనుక మరో కారులో వస్తున్న కార్ల్‌ హుబీ అనే వ్యక్తి, మెరుపును కెమెరాలో బంధించారు.  దానికి సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అవి కాస్త వైరల్‌ అవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu