Ad Code

జియో డేటా లోన్ తీసుకోండిలా!


తాజాగా జియో మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఇంటర్నెట్‌ ఉపయోగిస్తోన్న సమయంలో రోజు వారి డేటా పూర్తయితే నెట్‌ స్పీడ్‌ తగ్గిపోతుంది. ఒకవేళ స్పీడ్‌ పెంచుకోవాలంటే మళ్లీ తప్పనిసరిగా రీఛార్జ్‌ చేసుకోవాలి. మరి అప్పటికప్పుడు డబ్బులు లేకపోవడమో, రీఛార్జ్‌ చేసే అవకాశం లేకపోతే ఎలా.? ఇందుకోసమే జియో #8216;రీఛార్జ్ నౌ అండ్‌ పే లేటర్‌#8217; అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు 1జీబీ డేటా ఉన్న డేటా ప్లాన్‌లను (రూ. 11) అప్పుగా తీసుకొవచ్చు. ఇలా ఒక్కో యూజర్‌కు ఐయిదు సార్లు ఈ అవకాశం కల్పించారు. రీఛార్జ్‌ ధరను యూజర్లు తర్వాత చెల్లించే వెసులుబాటు కల్పించారు.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధానం 

* యూజర్లు ముందుగా మైజియో యాప్‌ను ఓపెన్‌ చేసి #8216;మెను#8217; ఆప్షన్‌లోకి వెళ్లాలి.

* అనంతరం మొబైల్‌ సర్వీసెస్‌లో #8216;ఎమర్జెన్సీ డేటా లోన్#8217; ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* తర్వాత #8216;ప్రొసీడ్‌#8217; ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత #8216;గెట్‌ ఎమర్జెన్సీ డేటా#8217;పై క్లిక్‌ చేయాలి.

* అనంతరం #8216;యాక్టివ్‌ నౌ#8217; పై క్లిక్‌ చేయగానే వెంటనే ఎమర్జెన్సీ డేటా లోన్‌ యాక్టివ్‌ అయిపోతుంది.

Post a Comment

0 Comments

Close Menu