Ad Code

చరిత్ర సృష్టించిన నిఫ్టీ


కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందనే సంకేతాలు, తయారీ కార్యకలాపాలు మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు 33 శాతం పుంజుకోవడం వంటి సానుకూల సంకేతాలు షేర్ హోల్డర్స్ లో విశ్వాసం నింపాయి. అదేవిధంగా హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్ తదితర కీలక కంపెనీల షేర్లు రాణించాయి.  స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. గతవారం నష్టాలు మూటగట్టుకున్న మదుపర్లు ఈరోజు లాభాల్లో మునిగి తేలారు. రెండు ప్రధాన సూచీలు జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. సెన్సెక్స్‌ తొలిసారి 16 వేల మార్క్‌ను దాటింది. ఓ దశలో సెన్సెక్స్‌ 937 పాయింట్లు లాభపడి 53,887 వద్ద.. నిఫ్టీ 261 పాయింట్లు ఎగబాకి 16,146 వద్ద జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. చివరకు సెన్సెక్స్‌ 872 పాయింట్లు లాభపడి 53,823 వద్ద, నిఫ్టీ 245 పాయింట్లు ఎగబాకి 16,130 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.26 వద్ద స్థిరపడింది. ఒక్క లోహ మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30 సూచీలో టైటన్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ నష్టాలు చవిచూశాయి.


Post a Comment

0 Comments

Close Menu