Ad Code

టాటా టిగోర్


భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త టాటా టిగోర్ ఈవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త టాటా టిగోర్ ఈవీ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.99 లక్షలుగా కంపెనీ చెబుతోంది. కొత్త బ్యాటరీ ప్యాక్‌తో జిప్‌ట్రాన్ టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాకప్ ఉంటుంది. బీఎస్‌6 టిగోర్ సబ్ కాంపాక్ట్ సెడన్‌కు అనుగుణంగా న్యూ టిగోర్ ఈవీలో కంపెనీ పలు మార్పులు చేపట్టింది. మెరుగైన సామర్ధ్యం, లాంగర్ రేంజ్‌ను ఆఫర్ చేస్తూ కంపెనీ జిప్‌ట్రన్ టెక్నాలజీని వాడుతూ న్యూ టిగోర్ ఈవీ కస్టమర్లను ఆకట్టుకోనుంది. న్యూ పవర్‌ట్రైన్ ఫీచర్‌ను న్యూ టిగోర్‌లో జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ 21,000 టోకెన్ అమౌంట్‌తో కస్టమర్లు న్యూ టిగోర్ ఈవీని బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా కొత్త టాటా టిగోర్ ఈవీలో అధునాతన ఫీచర్స్, పరికరాలు అందుబాటులో ఉంటాయి. త్వరలో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ప్రారంభం కానుండగా, టీల్ బ్లూ, డేటోనా గ్రే అనే రెండు కలర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన టాటా టిగోర్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE, XM మరియు XZ+ వేరియంట్లు. వీటి ధరల విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ. XE ధర రూ. 11.99 లక్షలు, XM ధర రూ. 12.49 లక్షలు కాగా XZ+ వేరియంట్ ధర రూ. 12.99 లక్షల వరకు ఉంటుంది టాటా టిగోర్ డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలో కొత్త ట్రై-యారో నమూనా, బ్లూ కలర్ స్లేట్ మరియు ఈవి బ్యాడ్జ్‌లు చాలా చోట్ల ఇవ్వబడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ మోడల్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌లైట్, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు బ్లూ యాక్సెంట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. టాటా టిగోర్ ఈవీ మునుపటి మోడల్.. ఒక చార్జితో 90 నుండి 100 కిమీ పరిధిని అందిస్తూ ఉండేది. ఇప్పుడు ఇందులో ప్రవేశపెట్టిన, జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా 306 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. అదే సమయంలో ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో, కేవలం ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కొత్త టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌కు కంపెనీ 8 సంవత్సరాల లేదా 1,60,000 కిమీ వారంటీని అందిస్తుంది. టాటా టిగోర్ ఈవి పూర్తిగా వాటర్‌ప్రూఫ్. వర్షాకాలంలో ఈ ఎలక్ట్రిక్ కారును నడపడం పెద్ద సమస్యగా అనిపించదు. ఇది 74 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకి కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాలంటే, మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Post a Comment

0 Comments

Close Menu