Header Ads Widget

భూమి వైపు దూసుకువస్తున్న గ్రహ శకలం


సూర్యుని కక్ష్యలో పరిభ్రమించే ఆస్టరాయిడ్లు అప్పుడప్పుడు భూమికి దగ్గరగా వస్తుంటాయి. వాటిల్లో కేవలం కొన్ని మాత్రమే భూమిని ఢీకొడుతుంటాయి. కొన్ని భూమికి సమీపంలో వచ్చి దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఒక ఆస్టరాయిడ్ భూమికి అత్యంత దగ్గరగా రానుంది. మరో 24 గంటల్లో ఆ ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా వస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలియజేసింది. ఆ గ్రహ శకలానికి  2016 AJ193 అని పేరు పెట్టారు. ఆగస్టు 21వ తేదీన సదరు గ్రహశకలం భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని, అయితే భూమిని మాత్రం ఢీకొనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దానికి భూమికి మధ్య ఉన్న దూరం.. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 9 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Post a Comment

0 Comments